మూర్చవ్యాధితో వ్యక్తి మృతి


Sat,August 10, 2019 11:29 PM

గుమ్మడిదల: మూర్చవ్యాధితో కిందపడిపోయిన వ్యక్తి మృతి చెందిన ఘటన దోమడుగు గ్రామంలోని ప్రగతి పాఠశాల సమీపంలో జరిగింది. గుమ్మడిల ఎస్‌ఐ రాజేశ్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ యూసఫ్‌గూడలోని వెంకటగిరికి చెందిన శరణాల ప్రవీణ్‌కుమార్(37)కు మూర్చవ్యాధి ఉంది. ఈ నెల 9వ తేదీ శుక్రవారం మండలంలోని దోమడుగు గ్రామానికి వచ్చి రాత్రి సమయంలో ప్రగతి స్కూల్ సమీపంలోని పాడుబడ్డ గదిలో పడుకున్నాడు. అదే సమయంలో ప్రవీణ్‌కుమార్‌కు ఫిట్స్ రావడంతో మృతి చెందాడు.

ఉదయం చుట్టు పక్కల వాళ్లు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ ఘటనా స్థలాన్ని పరిశీలించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం మృతుడి అక్క వసంతమాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...