సంగారెడ్డిలో వరుణయాగం


Sat,August 10, 2019 11:29 PM

సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ: చదురు మదురు జల్లులతో పంటలకు ఊపిరినిస్తున్న, భూగర్భ జలాలు భారీ వర్షాలు కురువాలని వరుణయాగం చేపట్టారు. శనివారం సంగారెడ్డి పట్టణంలోని ఎంఐజీ ఫేజ్-1 భైపాస్‌రోడ్డులోని హరిహర కళాక్షేత్రం అధ్యక్షుడు నాయికోటి రామప్ప ఆధ్వర్యంలో వరుణయాగం నిర్వహించారు. ఈ యాగం జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకుడు మహేశ్వర స్వామి సిద్ధాంతి ఆధ్వర్యంలో పురోహితులు రాజమౌళి శర్మ, విజయ్‌కుమార్ పంతులు వేద మంత్రోశ్ఛరణలతో ఘనంగా జరిపారు. ఆలయ కమిటీ నిర్వహించిన 108 కలశాలతో స్థానిక పోచమ్మ గుడి నుంచి నీటిని తీసుకువచ్చి శివునికి రుద్రాభిషేకం చేశారు.

పురోహితులు వర్షాలు సకాలంలో కురిస్తే నీటి ఎద్దడి ఉండదని, తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతూ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారని, వరుణయాగంతో వర్షాలు పుష్కలంగా కురువాలని భక్తులు వరుణ దేవున్ని కరుణించాలని కోరారు. ఈ వరుణయాగంలో స్థానిక బ్యాంకు కాలనీ, విద్యానగర్ కాలనీ, పోతిరెడ్డిపల్లి, ఎంఐజీ-ఫేజ్-1,2ల నుంచి భారీ సంఖ్యలో మహిళలు భక్తులు విచ్చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుమంగళి చంద్రశేఖర్, కాలనీవాసులు శ్యామ్‌రావ్, విజయేందర్ రెడ్డి, వెంకట్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, మహిళలు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...