డంపింగ్ యార్డును ఏర్పాటు చేయండి


Sat,August 10, 2019 11:29 PM

అందోల్, నమస్తే తెలంగాణ: అందోలు-జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని చెత్తాచెదారాన్ని రిక్షా కాలనీ సమీపంలో వేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఐ డివిజన్ కార్యదర్శి నర్సింహులు అన్నారు. శనివారం రిక్షాకాలనీ సమీపంలో చెత్తాచెదారాన్ని వేస్తున్న స్థలాన్ని ఆయన పరిశీలించారు. పట్టణంలోని చెత్తను సేకరించి, ఇక్కడే పారవేస్తున్నారని, అంతేకాకుండా మటన్, చికెన్ దుకాణాలకు సంబంధించిన వ్యర్థ పదార్థాలను కూడా ఇక్కడే పారబోస్తున్నారని తెలిపారు.

దీంతో దుర్వాసన, దోమల బెడద ఎక్కువైందన్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఐ మైనార్టీ అధ్యక్షుడు జావీద్, నాయకులు అర్జున్, యూసూఫ్, కృష్ణ, జానీ ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...