ఇక కశ్మీర్ ప్రజలకు మంచి రోజులే


Sat,August 10, 2019 11:28 PM

-మాజీ మంత్రి పి.బాబూమోహన్
అందోల్, నమస్తే తెలంగాణ: ఒకే దేశం-ఒకే రాజ్యాంగం...దేశ ప్రజలందరికీ సమాన హక్కులను కల్పించాలన్న ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం జమ్మూ-కాశ్మీర్‌లో అమల్లో ఉన్న 370 అర్టికల్‌ను రద్దు చేసి, ఆ ప్రాంత ప్రజలకు తగిన న్యాయం చేశారని మాజీ మంత్రి పి.బాబూమోహన్ అన్నారు. ఆర్టికల్370 రద్దును విమర్శిస్తున్న వారంతా దేశ ద్రోహులేనని, వారు అసలు భారతీయులేకారనీ ఆయన విమర్శించారు. శనివారం జోగిపేటలో విలేకర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అంతర్భాగమైన జమ్మూ-కాశ్మీర్‌లో ఉన్నవారంతా భారతీయులేనని, వారందరికీ మన రాజ్యాంగం హక్కులను పొందేందుకు ఈ ఆర్టికల్‌ను రద్దు చేశారన్నారు. జమ్మూకాశ్మీర్ ప్రజలకు ఇక నుంచి మంచి రోజులేనని తెలిపారు.

కాంగ్రెస్ పాలనలోనే జమ్మూ-కాశ్మీర్ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో అమలయ్యే పథకాలు జమ్మూ-కశ్మీర్ ప్రజలకు ఇక నుంచి వర్తించనున్నాయన్నారు. ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా అన్ని విధాలుగా జమ్మూ-కశ్మీర్ అభివృద్ధిలో పరుగులు తీస్తుందన్నారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలు ఆర్టికల్ రద్దుపై మద్దతును తెలిపాయని, వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలను ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ ఆర్.ప్రభాకర్‌గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ ప్రభాత్‌కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు జగన్నాథం, మాణయ్య, నాయకులు సాయి, నవీన్, వెంకట రమణ, హరీశ్ పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...