మాజీ సర్పంచ్ జోగినాథ్ సేవలు చిరస్మరణీయం


Sat,August 10, 2019 11:28 PM

అందోల్, నమస్తే తెలంగాణ: జోగిపేట మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ డాకూరి జోగినాథ్ సేవలు చిరస్మరణీయమని మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, మాజీ మంత్రి పి.బాబూమోహన్ అన్నారు. శనివారం జోగిపేటలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన జోగినాథ్ దశదిన కర్మ సందర్భంగా సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జోగినాథ్ చిత్రపటానికి జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి, ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు.

అనంతరం వారు మాట్లాడుతూ జోగిపేట తపంచాయతీకి 2001లో సర్పంచ్‌గా గెలుపొంది, అనేక అభివృద్ధి పనులను చేపట్టారని వారు కొనియాడారు. సంతాప సభలో జడ్పీ మాజీ చైర్మన్ బాలయ్య, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి మదన్‌మోహన్‌రావు, నాయకులు పట్లూరి శివశేఖర్, హెచ్.రామాగౌడ్, ఎస్.సురేందర్‌గౌడ్, ప్రవీణ్ కుమార్, సునీల్, ప్రభాకర్‌గౌడ్, మాణయ్య, ప్రభాత్, జగన్నాథం ఉన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...