గీతంలో రెండో రోజు గణిత సదస్సు


Sat,August 10, 2019 11:28 PM

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్‌లో జరుగుతున్న మ్యాథమెడికల్ సైన్సెస్ అండ్ అప్లికేషన్స్‌పై నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు రెండో రోజు జోరుగా జరిగింది. శనివారం గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండోరోజు కార్యక్రమాల్లో భాగంగా పరిశోధన పత్రాల సమర్పణ, ప్లీనరీ ప్రసంగాలు కొనసాగాయి. దేశం నలుమూలలతో పాటు విదేశాల నుంచి వచ్చిన దాదాపు 300మంది ప్రతినిధులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించి, సదస్సు అధ్యక్షులు, సభీకులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు.

కుప్పంలోని ద్రవీడియన్ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్ పీవీ అరుణాచలం, జేఎన్‌టీయూ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ ఎంఏ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. అమెరికా నుంచి వచ్చిన ప్రొఫెసర్ జెర్మియా కె.బిల్లా కీలకోపన్యాసం చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన ప్రొఫెసర్ ఐపీ రాజశేఖర్, ఎన్‌ఐటీ తాడేపల్లిగూడెంకు చెందిన ప్రొఫెసర్ జీ రాధాకృష్ణమాచార్యలు సదస్సులో ప్రసంగించారు.

రెండో సెషన్‌కు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డీ భారతి, ఎన్‌ఐటీ వరంగల్‌కు చెందిన ప్రొఫెసర్ జేవీ రమణమూర్తి అధ్యక్షత వహించారు. ఓయూ ప్రొఫెసర్లు ఎం కృష్ణారెడ్డి, ఎస్వీయూ ప్రొఫెసర్ ఎస్ శ్రీనాథ్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ పీ అనంత లక్ష్మీనారాయణ, కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్ టీ శ్రీనివాస్ ప్లీనరీ ఉపన్యాసాలు చేశారు. మూడో సెషన్‌కు కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్ టీ శ్రీనివాస్, ఎస్వీయూ ప్రొఫెసర్ ఎస్ రామకృష్ణ అధ్యక్షత వహించగా, ఎన్‌ఐటీ వరంగల్ ప్రొఫెసర్ డీ శ్రీనివాసాచార్యలు ప్రసంగించారు. అనంతరం గీతం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆలరించాయి. చక్కటి ప్రతిభనకు కనబర్చిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కే మారుతీప్రసాద్, నిర్వాహకులు డాక్టర్ శివారెడ్డి శేరి, డాక్టర్ పి నర్సింహాస్వామి, కోశాధికారి డాక్టర్ డీ మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...