రాయికోడ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా


Fri,August 9, 2019 10:55 PM

రాయికోడ్: మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎంపీపీ వెంకట్‌రావుపాటిల్ అన్నారు. ఎంపీపీగా ఎన్నికైన తర్వాత మొదటిసారి శుక్రవారం సింగితంలోని సూల్తాని హైమద్ షావాలి దర్గా సందర్శించి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంతోశ్‌పాటిల్ ఎంపీపీ వెంకట్‌రావుపాటిల్, జడ్పీటీసీ మల్లికార్జున్‌పాటిల్, ఎంపీడీవో స్టీవేన్‌నీల్‌లను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నిరంజన్, నాయకులు సుభాశ్‌రెడ్డి, మైపాల్, తదితరులు ఉన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...