చెట్లే మానవాళికి జీవనాధారం


Fri,August 9, 2019 10:54 PM

రాయికోడ్: హరితహారం కార్యక్రమం గ్రామాల్లో జోరుగా కొనసాగుతున్నది. శుక్రవారం మండల పరిధిలోని గ్రామా ల్లో లక్ష మొక్కలు నాటాలనే కార్యక్రమంలో 31 గ్రామ పంచాయతీల్లో లక్షా20వేల మొక్కలను పంచాయతీ కార్యాలయాలు, ప్రధాన రహదారులపై నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ వెంకట్‌రావుపాటిల్, ఎంపీడీవో మాట్లాడుతూ... అన్ని గ్రామాల్లో హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు , యువజన సంఘాలు, పార్టీల నేతలు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటి సంరక్షించాలని పేర్కొన్నారు. మండల పరిధిలోని గ్రామాల్లో లక్షా20వేల మొక్కలు నాటినట్లు ఎంపీడీవో పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీపీటీసీ మల్లికార్జున్ పాటిల్, ఎంపీడీవో స్టీవేన్‌నీల్, మండల వ్యవసాయ అధికారి అవినాశ్‌వర్మ, అయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

వట్‌పల్లిలో..
వట్‌పల్లి: మానవాళి మనుగడకు చెట్లే జీవనాధారం అని ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటి సంరక్షణకు బాధ్యతగా తీపుకోవాలని ఎంపీడీవో రఘు సూచించారు. శుక్రవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా మేడుకుంద, షాద్‌నగర్, దేవునూర్, పాలడ్గు, గొర్రెకల్, నాగులపల్లి, పల్వట్ల, బిజిలీపూర్, కేరూర్ గ్రామాల్లో మొక్కలు నాటేందుకు తీసిన గుంతలను పరిశీలించారు. అనంతరం స్థానికులకు మొక్కలు పంపిణీ చేయడంతో పాటు మొక్కలు నాటి వాటి విశిష్టతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ హరితహారంలో ప్రజా ప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది పాల్గొని పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, ప్రధాన రహదారులపై మొక్కలు నాటాలని పేర్కొన్నారు. అదే విధంగా దుద్యాల పంచాయతీలో జడ్పీటీసీ అపర్ణశ్రీకాంత్ స్థానికులకు మొక్కలు పంపిణీ చేశారు.ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సిబ్బంది, అధికారులు పాల్గొని స్థానికులకు మొక్కలు పంపిణీ చేసి వాటిని నాటి సంరక్షించాలని పేర్కొన్నారు.

పుల్కల్‌లో..
పుల్కల్: మండలంలో హరితహారం కార్యక్రమం జోరందుకున్నది. శుక్రవారం కోర్పోల్, పుల్కల్ గ్రామాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కోర్పోల్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఎంపీటీసీ వీరాగౌడ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నర్సమ్మ, గ్రామ యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. మండల కేంద్రం పుల్కల్‌లో హరితహారంమొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీటీపీ శ్రీనివాస్‌చారి, సర్పం చ్ శ్రావణ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

అందోల్ రూరల్‌లో..
అందోల్ రూరల్: తెలంగాణకు-హరితహారంలో భాగంగా మండలంలోని గ్రామాల్లో మొక్కల పంపిణీ, నాటడం కార్యక్రమాన్ని చేపట్టారు. శుక్రవారం మండల పరిధిలోని నేరడిగుంట, కన్‌సాన్‌పల్లి, నాదులాపూర్, తాడ్మన్నూర్, అక్సాన్‌పల్లి, మాసానిపల్లి గ్రామాల్లో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేరడిగుంటలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీపీ బాలయ్య, సర్పంచ్ చందులతలు పాల్గొని, మహిళలకు మొక్కలు పంపిణీ చేసి, గ్రామంలోని పాఠశాల ఎదుట ఖాళీ స్థలంలో మొక్కలు నాటారు. అక్సాన్‌పల్లిలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో జడ్పీటీసీ రమేశ్ పాల్గొని, డ్వాక్రా మహిళలకు మొక్కలు పంపిణీ, వారితో కలిసి మొక్కలను నాటారు. కన్‌సాన్‌పల్లిలోని ఈశ్వరాలయంలో సర్పంచ్ యాదాగౌడ్, మాసానిపల్లి సర్పంచ్ రాణి, తాడ్మన్నూర్ సర్పంచ్ సంగీత అనిల్‌రెడ్డిల ఆధ్వర్యంలో మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాణిక్‌రెడ్డి, కార్యదర్శి వీరయ్య, నాయకులు గజేందర్‌రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రభుదాస్ పాల్గొన్నారు.

మునిపల్లిలో..
మునిపల్లి: హరితహారంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జడ్పీటీసీ పైతర మీనాక్షి సూచించారు. శుక్రవారం ఎంపీపీ శైలజతో కలిసి మండలంలోని పలు గ్రామాల్లో హరితహారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తున్నదని వాటిని తీసుకెళ్లి ఇండ్ల వద్ద నాటాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అల్లంనవాజ్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...