ఆవులు, ఎద్దుల ఆక్రమ రవాణా జరుగకుండా చూడాలి


Fri,August 9, 2019 10:53 PM

అందోల్, నమస్తే తెలంగాణ: బక్రీద్ పండుగ కోసం ఆవులు, ఎద్దుల ఆక్రమ రవాణాను అడ్డుకోవాలని హిందూ వాహిని ఆధ్వర్యంలో జోగిపేట పోలీస్ స్టేషన్‌లో వినతి పత్రాన్ని శుక్రవారం అందజేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఆవుల రవాణా జరుగకుండా చూడాలన్నారు. జాతీయ రహదారిపై వాహనాల తనిఖీని నిర్వహించాలని వారు కోరారు. కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.సాయి, జిల్లా సహాయ కార్యదర్శులు సీహెచ్. వినీత్, సభ్యులు పురం రఘు, పి.వెంకట రమణ, మణికంఠ, నవీన్ కుమార్ పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...