ప్రతి మొక్కను సంరక్షించాలి


Fri,August 9, 2019 10:53 PM

జహీరాబాద్, నమస్తే తెలంగాణ : నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు ప్రతి కృషి చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. శుక్రవారం జహీరాబాద్ మండలంలోని రాయిపల్లి(డీ)లో ఏర్పాటు చేసిన మెగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు నాటుతుందన్నారు. ఇందులో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులై మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. హరితహారం దేశంలోనే ప్రతి రాష్ర్టానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. జిల్లాలో కలెక్టర్ హనుమంతరావు మెగా హరితహారం నిర్వహించి, లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు.

బహూమతులను అందజేస్తాం..
రాయిపల్లి(డీ)లో అధిక మొక్కలు పెంచిన వారికి ఏడాదిలో గుర్తించి బహుమతులు అందజేస్తామని ఎమ్మెల్యే మాణిక్‌రావు తెలిపారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, టీఆర్‌ఎస్ నాయకులు కలిసి కట్టుగా కదిలి మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాటిన ప్రతి మొక్కను కాపాడేందుకు ఉపాధి హామీలో కూలీలు నియమించి నీరు అందించాలన్నారు. ఒక్క మొక్క ఎండకుండా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. ఎవరు ఎక్కువ మొక్కలు పెంచితే వారికి బహూమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు రాములు, సుమతి, పీఆర్ ఏఈ కోటేశ్వర్‌రావు, ఉపాధి హామీ ఏపీవో అశోక్ కుమార్, టీఆర్‌ఎస్ నాయకులు చిరంజీవిరెడ్డి, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని చెరాగ్‌పల్లిలో ఎంపీపీ గిరిధర్‌రెడ్డి, కొత్తూర్(బీ), దిడ్గిలో టీఆర్‌ఎస్ నాయకులు, ఎంపీటీసీ ఎంజీ.రా ములు మొక్కలు నాటారు. మొగుడంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్‌లు మొక్కలు నాటారు. సజ్జారావుపేటతండా, ఇప్పెపల్లిలో సర్పంచ్‌లు శంకర్ నాయక్, సురేశ్ మొక్కలు నాటారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...