ఆకుపచ్చని తెలంగాణే సీఎం లక్ష్యం


Fri,August 9, 2019 10:52 PM

జిన్నారం : ఆకుపచ్చని తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. హరిత తెలంగాణగా మార్చేందుకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం సా యంత్రం మండలంలోని మాధవరం, కొడకంచి, నల్తూరు, ఊ ట్ల, మంగంపేట గ్రామాలలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జడ్పీవైస్ చైర్మన్ కె.ప్రభాకర్, ఎం పీపీ రవీందర్‌గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లతో కలిసి మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం లో అడవుల శాతం చాలా తగ్గిందని గుర్తించిన సీఎం రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకం గా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. నాలుగు విడుతల్లో నాటిన మొక్క లు గ్రామాలలో ఏపుగా పెరుగుతున్నాయన్నారు. ఐదవ విడుతలో నాటుతున్న మొక్కలన్నింటిని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డుసభ్యులు సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. నాటిన ప్రతి మొక్కను పెంచాలన్నారు.

ఇందుకోసం మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయాలన్నారు. హరితహారంలో పరిశ్రమలు కూడా పాల్గొంటున్నాయన్నారు. హరితహారంలో పాల్గొనని పరిశ్రమలు వెంటనే కేటాయించిన గ్రామాలలో కార్యక్రమాలు ప్రారంభించాలని సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని ఎవరూ కూడా మొక్కుబడిగా తీసుకోవద్దన్నారు. మనకోసం మన భవిష్యత్తు తరాల కోసం సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. కొడకంచిలో డెక్కన్ ఆటో పరిశ్రమ ప్రారంభించడానికి వచ్చిన సీఎం మొదటి విడుతలో మొక్కను నాటడం మనకు గొప్ప అనుభూతి అని అన్నారు. ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ హరితహారాన్ని చాలెంజ్‌గా తీసుకొని గ్రామాలలో ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలను నాటాలన్నారు. గ్రామాలకు అవసరమైనన్ని మొక్కలు నర్సరీలలో సిద్ధంగా ఉన్నాయన్నారు.

ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేయాలన్నారు. పాఠశాలలో మొక్కలు నాటడంతో పాటు విద్యార్థులకు మొక్కలు ఇవ్వాలన్నారు. రైతుల పొలాల వద్ద నాటుకునేందుకు అవసరమైన మొక్కలు పంపిణీ చేయాలన్నారు. పండ్ల, పూల మొక్కలతో పాటు ఔషద మొక్కలు కూడా పంపిణీ చేస్తే అందరికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేశ్, సర్పంచ్‌లు సరితాసురేందర్‌గౌడ్, శివరాజ్, జనార్దన్, ఆంజనేయులు, ప్రశాంతీనరేందర్, ఎంపీటీసీలు భార్గవ్, బత్తుల సంతోషమహేశ్, జనాబాయి, కో ఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...