మౌలిక సదుపాయాలకు పెద్దపీట


Sun,July 21, 2019 11:37 PM

అమీన్‌పూర్ : అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని కాలనీల్లోనూ దశలవారీగా సమస్యలను పరిష్కరించడం జరుగుతందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని మారుతీ నగర్ కాలనీ వద్ద ఎమ్మెల్యే సొంత నిధులతో నూతనంగా నిర్మించిన కాలనీ ముఖద్వారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీటీసీలు అనిల్, కొల్లూరి మల్లేశ్, బాలరాజ్, నాయకులు యూనుస్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఆలయ నిర్మాణాలకు సహకారం అందిస్తాం..
అమీన్‌పూర్ పరిధిలోని ఆయా గ్రామాలు, కాలనీల్లో నూతనంగా నిర్మించబోయే ఆలయాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం అమీన్‌పూర్ పరిధిలోని మారుతీనగర్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న సాయిబాబా ఆలయానికి, రాఘవేంద్ర కాలనీలో నూతనంగా నిర్మించనున్న ట్యాంకు, ప్రహారీ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తూ తాను ఆలయాల అభివృద్ధికీ సాయం చేస్తానన్నారు. ఆలయాలతోపాటు మసీదులు, దర్గాలు, చర్చీల నిర్మాణానికి కూడా చేయూతనిస్తానని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే తెలియజేస్తే పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు తుమ్మల పాండురంగారెడ్డి, కొల్లూరి మల్లేష్, బాల్‌రాజ్, ఎ.శ్రీనివాస్‌రెడ్డి, యూనుస్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...