టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంగా ఉన్నారు


Sun,July 21, 2019 11:37 PM

అమీన్‌పూర్ : కేవలం టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంగా ఉన్నారని, అందుకే తమకు రెండోసారి వారు అధికారాన్ని కట్టబెట్టారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. అమీన్‌పూర్ పరిధిలోని మారుతీనగర్ కాలనీ, బీరంగూడ మంజీరా నగర్ కాలనీల్లో నూతనంగా నిర్మించిన టీఆర్‌ఎస్ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేష రీతిలో స్పందన లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి వల్లే ప్రజలు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనివిధంగా పేదలకు అనేక పథకాలను తీసుకొని వచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు.. తదితర ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎవైనా టీఆర్‌ఎస్‌కే ప్రజలు ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీటీసీలు వడ్ల కాలప్ప, కొల్లూరి మల్లేశం, అనిల్, నాయకులు యూనుస్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...