రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా టీఆర్‌ఎస్


Sun,July 21, 2019 11:37 PM

రామచంద్రాపురం : రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా టీఆర్‌ఎస్ అవిర్భావించిందని భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మలు అన్నారు. ఆదివారం భారతీనగర్ డివిజన్‌లోని ఎంఐజీలో వారు టీఆర్‌ఎస్ సభ్యత్వ నమో దు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాలనీవాసులతో పార్టీ సభ్యత్వాలు చేయించా రు. అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ని అ న్నివర్గాల ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ స భ్యత్వం తీసుకోవడానికి ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం బంగారు తెలంగాణగా అభివృద్ధి చెందాలంటే అది కేవలం సీఎం కేసీఆర్‌కే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. ని యోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సారథ్యంలో పార్టీ సభ్యత్వాలు జోరుగా సాగుతున్నాయని వారు తెలిపారు. కార్యక్రమంలో శ్రీలత, స్వరూప, ఇందిరా, ఉర్మిల, శోభ, అఖిల, యూసుఫ్, అజీం, బూన్ తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...