సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం


Sat,July 20, 2019 11:38 PM

పటాన్‌చెరు రూరల్, నమస్తే తెలంగాణ: ప్రజా సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం పటాన్‌చెరు పట్టణంలో ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పెంచిన ఆసరా పింఛన్ల ఉత్తర్వుల పత్రాలను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వృద్ధులు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రజా ప్రభుత్వం అన్నారు. ప్రజలు దీవించడంతోనే రెండోసారి అధికారంలోకీ వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలకు పెద్దన్న అన్నారు. వృద్ధులకు పెద్ద కొడుకుగా అభివర్ణించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రొసీడింగ్ అందిస్తున్నారన్నారు. రూ.75 పింఛన్ ఇచ్చేందుకు నాటి ప్రభుత్వాలు పలుమార్లు ఆఫీసుల చుట్టూ తిప్పుకునేవారన్నారు. రూ. రూ.200 కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏకంగా రూ.1000 పింఛన్ పెంచిందన్నారు. దివ్యాంగులకు రూ.500 నుంచి 1500 పెంచామన్నారు. పెంచిన రూ. 2116, రూ.3116 అందజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, జడ్పీటీసీలు సుప్రజవెంకట్‌రెడ్డి, గంగుల సుధాకర్‌రెడ్డి, ఎంపీపీలు సుష్మశ్రీ, ఈర్ల దేవానంద్, సద్ది ప్రవీణభాస్కర్‌రెడ్డి, కార్పొరేటర్ తొంట అంజయ్యయాదవ్, పటాన్‌చెరు వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, ఏఎంసీ చైర్‌పర్సన్ పుష్పానాగేశ్, తహసీల్దార్ యాదగిరియాదవ్, ఎంపీడీవో అనంతరెడ్డి, ఈవోపీఆర్‌డీ దేవదాస్, సర్పంచ్‌లు మధు ముదిరాజ్, భాగ్యలక్ష్మి, భిక్షపతి, కర్ధనూర్ ఉప సర్పంచ్ వడ్డెకుమార్, టీఆర్‌ఎస్ మండల ప్రెసిడెంట్ దశరథరెడ్డి, చంద్రారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, ఎంపీటీసీలు వెంకటేశంగౌడ్, మన్నెరాజు, గోల్కొండ నాగజ్యోతి, సునీత, నీనా చంద్రశేఖర్‌రెడ్డి, దండ్ల సునీత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అందరి ఆశీస్సులు కావాలి -జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ
అందరి ఆశీస్సులు టీఆర్‌ఎస్ సర్కారుపై ఉండాలి. సీఎం కేసీఆర్ పేద, బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలుస్తున్నారు. రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా ఉంచుతున్న నేత. మనం ఆయనతో పాటు ఉండాలి. అందరూ పెద్ద మనస్సుతో వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో దీవించాలి. పింఛన్ తీసుకునే వయస్సును మరింత తగ్గించి 57 ఏండ్లకు చేశారని దీంతో లక్షల మందికి లబ్ధి చేకూరుతున్నది. ప్రజలు పింఛన్లు పెరుగడంతో ఎంతో సంతోషంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ ఇస్తున్న ధీమా అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నది.

నగరం దాహార్తిని సీఎం తీరుస్తున్నారు-ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
సీఎం కేసీఆర్ అపార భగీరథుడిలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు నీటిని అందజేస్తున్నారు. త్వరలోనే ప్రతి ఇంటికి తాగునీరు అందజేస్తాం. బొల్లారం, అమీన్‌పూర్, తెల్లాపూర్‌లో పుష్కలమైన తాగునీటిని అందజేయబోతున్నాం.పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి. అవి పూర్తికాగానే ప్రతి గడపకూ నీరందిస్తాం. పాలన అందజేసేందుకు సీఎం కేసీఆర్ పటిష్టమైన కొత్త పురపాలక చట్టాన్ని తీసుకువచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణలో అమలు చేస్తున్నారు. కొత్తగా పెరిగిన పింఛన్లతో అందరిలో ధీమా పెరిగింది. సీఎం కేసీఆర్ వెయ్యి పింఛన్‌ను రూ.2016, దివ్యాం గులకు రూ.1500 నుంచి రూ. 3,116 పెం చారు. 65ఏండ్ల వయోపరిమితిని 57కి తగ్గించారు. ప్రజలు మొక్కలను నాటేందుకు ముం దుకు రావాలి.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...