నా వంతు సహకారం అందిస్తా


Sat,July 20, 2019 11:38 PM

సంగారెడ్డి చౌరస్తా : చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో ముందుండి తన వంతు సహకారం అందిస్తానని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మెడ్విన్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అంగన్‌వాడీలకు ఎంపీ ఎంజాయ్ రీడింగ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడ్విన్ సంస్థ పలు కార్యక్రమాల్లో ముందుంటుందని కొనియాడారు. అంగన్‌వాడీ పిల్లలకు ఎర్లీ గ్రేడ్ లెర్నింగ్ కోసం అత్యంత సులువుగా చిన్న పిల్లలకు అర్థమయ్యే విధంగా రూపొందించిన ఎంజాయ్ రీడింగ్ కిట్లను ఉచితంగా అందిస్తున్నందుకు ఎంపీ అభినందించారు. చిన్న పిల్లలకు సంబంధించిన ఏ కార్యక్రమానికైనా తన నిధుల నుంచి కొంత మొత్తాన్ని కేటాయిస్తానని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ సైతం సీఎస్‌ఆర్ నిధుల నుంచి కొంత మొత్తాన్ని కేటాయించాలని కోరారు. ఈ కిట్‌ను పరిశీలించి ఏ విధంగా ఉపయోగించాలని తెలుసుకున్నారు. అంగన్‌వాడీ పిల్లలకు కిట్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం ఎంజాయ్ రీడింగ్ కిట్లను ఆయా అంగన్‌వాడీ టీచర్లకు అందజేశారు. మెడ్విన్ చైర్మన్ మనోహర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ పిల్లల కోసం ఏదైనా చేయాలనే తపనతో బోద్‌గురు టెక్నాలజీ సహకారంతో రూపొందించిన ఎంజాయ్ రీడింగ్ కిట్లను ఎంపిక చేసిన 100 అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు. దేశంలోనే మొదటి సారిగా ఇటువంటి కిట్లను రూపొందించి సంగారెడ్డి జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో కిట్ రూ.6వేలు ఉంటుందన్నారు. భవిష్యత్‌లో మరింత సహకారాన్ని అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఐసీడీఎసీ పీడీ మోతీ, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, బోద్‌గురు టెక్నాలజీ ప్రతినిధులు అనుభ, సమీర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...