ఆసరాకు జిల్లాలో రూ.30కోట్లు


Sat,July 20, 2019 11:37 PM

అందోల్, నమస్తేతెలంగాణ : జిల్లాలో ఆసరా పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రతి నెల సుమారు రూ.30కోట్లు ఖర్చు పెడుతుందని జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ అన్నారు. శనివారం జోగిపేటలోని వాసవీ కల్యాణ మండపంలో పెంచిన ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్ ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రొసిడింగ్ ఉత్వర్వులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో బీడీ కార్మికులకు కొత్త పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కేసీఆర్ బతికున్నంతకాలం తెలంగాణ రాష్ర్టానికి సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. బంగారు తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. రానున్న ఐదు సంవత్సరాల్లో సంక్షేమ కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కుటుంబంలో పెద్ద కొడుకుగా పింఛన్లు అందిస్తూ ప్రతి ఒక్కరికీ భరోసా కల్పిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఎన్నికల కోడ్ ఉండడంతో హామీల అమలుకు అడ్డంకులు ఏర్పడ్డాయని అన్నారు. పింఛన్ వయస్సును 65 సంవత్సరాల నుంచి 57సంవత్సరాలకు తగ్గించి ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందే విధంగా చేస్తున్న సీఎం కేసీఆర్ పదికాలాలపాటు జీవించాలని ఆకాంక్షించారు. అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అన్ని వర్గాలకు చేయూతనందించేందుకు సీఎం పింఛన్లు ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 14లక్షల మంది ఆసరా పింఛన్‌దారులకు సుమారు రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం పింఛన్లు ఇస్తున్నారని అన్నారు. పింఛన్లతో ప్రతి ఒక్కరి మదిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారని కొనియాడారు. ఎన్నికల్లో మా గెలుపునకు బలాన్ని ఇచ్చిన వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

రూ.కోటితో వాకింగ్ ట్రాక్...
జోగిపేటలోని ఎన్టీఆర్ స్టేడియం ఆవరణలో రూ.కోటితో చేపట్టనున్న వాకింగ్ ట్రాక్ పనులకు ఎంపీ బీబీపాటిల్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ శంకుస్థాపన చేశారు. అందోల్ కోటా వద్ద రూ.కోటి 20లక్షలతో నిర్మించనున్న మురుగు కాల్వల పనులకు శంకుస్థాపన చేశారు.

జోగిపేటలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే..
మై ఎర్త్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం పోసానిపేట రోడ్డులో ఇరువైపులా ఏర్పాటు చేసిన మొక్క నాటే కార్యక్రమంలో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవాళి మనుగడకు మొక్కలు నాటాలని సూచించారు. ప్రభుత్వం హరితహారంలో భాగంగా వేలాది మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుందన్నారు. వర్షాలు కురవాలంటే చెట్లు ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు రమేశ్, సౌజన్య, మీనాక్షి, మల్లికార్జునపాటిల్, ఎంపీపీలు బాలయ్య, వెంకట్రావ్‌పాటిల్, శైలజ, తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగభూషణం, కమిషనర్లు మిర్జా పసహత్ అలీబేగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...