పేటలో శ్రీకాళికామాతా బోనాలు


Sat,July 20, 2019 12:36 AM

సంగారెడ్డి అర్బన్, నమస్తేతెలంగాణ : సదాశివపేటలోని శ్రీ కాళికామాతా బోనాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని సాగర్‌నగర్‌లో కొలువుదీరిన శ్రీకాళికా అమ్మవారికి మహిళలు బోనాలు, పోతరాజుల విన్యాసాలతో అమ్మవారి ఆలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ కౌన్సిలర్ ఆకుల మంజుల శివకుమార్ కాళికామాతా బోనాల పండుగ ఘనంగా నిర్వహించేందుకు రూ.లక్ష విరాళంగా అందజేశారు. బోనాల ఉత్సవాలకు విరాళం అందజేసిన మాజీ కౌన్సిలర్‌ను ఆలయ కమిటీ భక్తబృందం ఆధ్వర్యంలో శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మాట్లాడుతూ అమ్మవారికి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు తన సంతోషంతో విరాళం అందజేశానని, భక్తులు, మహిళలు శాంతియుతంగా సంతోషంగా పండుగను చేసుకోవాలన్నారు. పండుగ వేడుకలతోపాటు ఆలయ అభివృద్ధికి కాలనీవాసులు సహకారం అందించి అభివృద్ధిలో ముందుంచాలని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అశోక్‌సాగర్, శ్రీనివాస్‌సాగర్, బక్కప్పసాగర్, అనంతకిషన్, విఠల్‌రెడ్డి, నర్సింహులుసాగర్, రాములు, సుధాకర్, బక్కప్ప, టి.సుధాకర్, గిరిసాగర్, నాగరాజ్, రమేశ్‌సాగర్, చిన్న, శంకర్, సంగమేశ్వర్‌రెడ్డి, మహిళలు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...