విలువలతో కూడిన రాజకీయాలు కావాలి


Sat,July 20, 2019 12:36 AM

సంగారెడ్డి టౌన్ : దేశంలో విలువలతో కూడిన రాజకీయాలు కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని కేవల్ కిషన్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా యువజన సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారం సాధించేందుకు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిందని అన్నారు. బీజేపీ అధికారం చేపట్టిన ఐదు సంవత్సరాల కాలంలో దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని అన్నారు. పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వమే ప్రకటించిందని ఆరోపించారు. అదే విధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ తమ రాజకీయ మనుగడను సాధించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సీపీఎం పార్టీకి ఓట్లు సీట్లు తగ్గింది వాస్తవమేనని, తిరిగి పుంజుకుంటామని తెలిపారు. సమావేశంలో సీపీఎం నాయకులు రాములు, జగదీశ్, మల్లేశం, జి.జయరాజ్ పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...