ఆడబిడ్డకు అండగా ఉందాం


Sat,July 20, 2019 12:35 AM

గుమ్మడిదల : ఆడబిడ్డకు అండగా నిలబడుదామని మంభాపూర్ గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. గుమ్మడిదల మండలం మంభాపూర్‌లో శుక్రవారం నిర్వహించిన స మావేశంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ దయానంద్‌లతో పాటు పంచాయ తీ సభ్యులు ఏకగ్రీవంగా మహిళలపై, ఆడబిడ్డలపై జరుగుతున్న దాడులపై ఆగ్రహం వ్య క్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించే చట్టాలను మరింతగా పటిష్టం చేయాలని కో రారు. తీర్మానంలో తమ గ్రామంలోని ఆడబిడ్డలందరిని సంరక్షిస్తామని, వారి బాగోగులకు బాధ్యత తీసుకుంటామన్నారు. మహిళల రక్షణకు గ్రామస్తులందరం కట్టుబడి ఉన్నామని ఎవరైనా పోకిరి పని చేసినా, లైంగిక దాడులకు పాల్పడినా వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పోలీసుల సాయంతో మహిళలపై నేరాలు జరుగకుండా చూస్తామని వారు తీర్మానం చేశారు. గ్రామస్తులు సైతం తీర్మానం చేయడంపై గ్రామస్తు లు, మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నారని యువజన సంఘాలు మద్దతు తెలిపాయి. కార్యక్రమంలో ఈవో స్వప్న, యువజన సం ఘాల సమితి రాష్ట్ర కార్యదర్శి చెన్నంశెట్టి, ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...