సంక్షేమం రెట్టింపు


Fri,July 19, 2019 02:39 AM

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం వయస్సు పైబడిన వృద్ధులకు కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా ఆసరా కల్పించిన విషయం తెలిసిందే. ప్రతినెలా రూ.1000 చొప్పున పింఛన్లు అం దుకొని మనుమలు, మనుమరాళ్లు, కుటుంబ సభ్యులతో పింఛన్‌దారులు సంతోషంగా గడుపుతున్నారు. సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకువేసి పింఛన్లు రూ.వెయ్యి నుంచి రూ.2,016, వికలాంగులకు రూ.15 వందల నుంచి రూ.3,016కు పెంచి అభాగ్యుల కండ్లల్లో ఆనందాన్ని తాండవింపజేసిన విషయం తెలిసిందే. గతఏడాదిలో జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఆసరా పింఛన్లను పెం చుతామని లబ్ధిదారులకు డబుల్ ధమాకా ప్రకటించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవండంలో సీఎం కేసీఆర్‌కు సాటిలేరు. ఏకంగా రెండింతలు ఆసరా పింఛన్లు పెంచి పింఛన్‌దారుల కుటుంబాల్లో ప్రభుత్వం భరోసా నింపారు. పెరిగిన పింఛన్లను ఈ నెల 20నుంచి పింఛన్‌దారులకు అందించేందుకు ప్రభుత్వం అన్నిఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం ప్రతినెలా జిల్లాలో 1,38,844 మంది లబ్ధిదారులు వివిధ రకాలుగా రూ.15.40 కోట్ల పింఛన్ డబ్బులను ప్రభు త్వం అందజేస్తున్నది. పెరిగిన డబుల్ ధమాకాతో ఇక నుంచి రూ. 34.35 కోట్లకు చేరిందని, దీంతో ప్రభుత్వంపై సగం భారం పడనున్నది. జిల్లాలో వివిధ రకాల పింఛన్లు వృధ్యాప్యం, వితంతు, చేనేత, గీత, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, ఇతరులకు రూ. 1000 చొప్పున ప్రతినెలా పింఛన్లు అందిస్తున్నది. అలాగే, వికలాంగులకు రూ.1500 చొప్పున ప్రభుత్వం ఆసరా పింఛన్లతో ఆదుకుంటున్నది.

ఈ నెల 20 నుంచి ఖాతాల్లోకి...
ఇప్పటి వరకు ప్రభుత్వం నెలనెలా పింఛన్‌దారులకు ప్రతి నెలా పింఛన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. పెంచిన పింఛన్లను జూలై 20 నుంచి లబ్ధ్దిదారుల ఖాతాల్లో జమచేయడానికి చర్యలు తీసుకున్నది. ఇక నుంచి పెరిగిన పింఛన్లు వృద్ధులకు రూ.2016, వికలాంగులకు రూ.3016 ల చొప్పున అందకోనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందించి చేతినిండా ఉపాధి కల్పించింది. కుటుంబ సభ్యులపై ఆధారపడి వయస్సు పైబడిన వృద్ధుల్లో మనోధైర్యం కల్పించేందుకు ఏకంగా రూ. 1000 పింఛన్‌కు పెంచి పింఛన్‌దారుల గుండెల్లో సీఎం కేసీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నికలకు ముందు పింఛన్లు పెంచి జూన్ నుంచి అందజేస్తామని ప్రకటించడంతో అధికారులు చర్యలు తీసుకొని ప్రభుత్వానికి నివేదికలు అందించిన విషయం తెలిసిందే. ప్రతి నెలా 1వ తేదీ రాగానే పింఛన్‌దారులు అధికారులను ఎదురు చూసే పరిస్థితిని ప్రభుత్వం తొలిగించి లబ్ధిదారుల ఖాతాలో జమచేసే వెసలుబాటును అమలు చేసింది. దీంతో ఒక నెల పింఛన్‌పొందిన పింఛన్‌దారులకు వచ్చే నెల పింఛన్ అందుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించడంతో పింఛన్లు పొందుతున్న కుటుంబాల్లో సంతోషం వెల్లువిరుస్తున్నది.

రెట్టింపు అయిన పింఛన్లు
తెలంగాణ ప్రభుత్వం ప్రతినెలా ఇచ్చే పింఛన్లను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. సీఎం కేసీఆర్ ఆసరా పథకం పేరుతో ప్రతినెలా అర్హులైన పింఛన్‌దారులకు రూ.1000 చొప్పున వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్లు అందజేస్తున్నది. ప్రభుత్వం పెంచినా పింఛన్లను జూన్ నెల నుంచి లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకున్నది. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, చేనేత, బీడీ, గీత కార్మికులతో పాటు హెచ్‌ఐబీ, బోధకాల బాధితులకు కూడా పింఛన్లను పెంచి రూ.2016 అందించనున్నది. అలాగే, దివ్యాంగులకు రూ.3016లకు 2018 ఎన్నికల సమయంలో పింఛన్లు పెంచుతామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయడంతో లబ్ధిదాకరులు ఆనందంతో ముఖ్యమంత్రిని ఆశీర్వదిస్తున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...