21 వరకు దోస్త్ ప్రవేశాలు


Fri,July 19, 2019 02:38 AM

నారాయణఖేడ్, నమస్తే తెలంగాణ: డిగ్రీ కళాశాలలో ప్రవేశం పొందేందుకు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్‌ల కోసం గురువారం నుంచి ఈ నెల 21వ తేది వరకు నారాయణఖేడ్ ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గణపతి తెలిపారు. ఇంటర్ సప్లిమెంటరీ పాస్ అయినవారు, గతంలో డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్ చేసుకోనివారు, సీటు వచ్చినా చేరని విద్యార్థులు తిరిగి రిజిస్ట్రేషన్, వెబ్‌ఆప్షన్ పెట్టుకునే వీలుందన్నారు. ఆయా విద్యార్థులు తమ ఇంటర్ పాస్ మెమో, ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్ నెంబర్‌తో కళాశాలకు రావాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 26న సీట్లు కేటాయించి 29లోగా కళాశాలలో ప్రవేశం కల్పించడం జరుగుతుందన్నారు. దోస్త్ ద్వారా విద్యార్థులకు ఇదే చివరి అవకాశమని ప్రిన్సిపాల్ వివరించారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...