హెల్త్ క్యాంపులను వినియోగించుకోవాలి


Fri,July 19, 2019 02:38 AM

-ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
సంగారెడ్డి టౌన్: హెల్త్ క్యాంపులను పోలీసు సిబ్బంది వినియోగించుకోవాలని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆరోగ్య భద్రత స్కిమ్ పోలీసు అధికారులు, సిబ్బందికి అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది తరచుగా అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గుండెపోటుతో మరణిస్తున్నారని, సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోకపోవడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి యశోద దవాఖాన వారి సహకారంతో హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశామన్నారు. ప్రతి నెల మూడో గురువారం రోజు ఆర్థోపెడిక్, కార్డియాలజీ డాక్టర్లు సంగారెడ్డి జిల్లా పోలీసు జిల్లా కార్యాలయంలో వైద్య సేవలు అందిస్తారని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని హెల్త్ క్యాంపుకు వచ్చిన వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్యాంపులో అడిషనల్ ఎస్పీ మహేందర్, యశోద దవాఖాన డాక్టర్లు కార్డియాలజిస్ట్ నర్సరాజు, ఆర్థోసర్జన్ శశికాంత్, జనరల్ ఫిజీషియన్ వీరారెడ్డి, గైనకాలజిస్ట్ బ్లెసీ, యశోద దవాఖాన మేనేజర్ విహాయ సారథి, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, పోలీసు మెడికల్ డిస్పెన్షనరీ డాక్టర్ జ్యోతి, ఎస్‌బీ సీఐ శ్రీనివాసనాయుడు, ఐటీకోర్ సీఐ హేమరాణి, ఆర్‌ఐలు హరిలాల్, డానియల్, కృష్ణ, పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...