ఘనంగా బోనాల పండుగ


Fri,July 19, 2019 02:37 AM

హత్నూర: మండలంలోని గోవిందరాజ్‌పల్లి గ్రామంలో గురువారం పోచమ్మతల్లి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం గ్రామస్తులు అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం అమ్మవారి బోనాల ఊరేగింపును పెద్ద ఎత్తున నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో బోనాల ఊరేగింపు అంగరంగవైభవంగా కొనసాగింది. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన మహిళలు బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాల్లో సర్పంచ్ బండమీది సునీతారాజు, ఉప సర్పంచ్ లక్ష్మి, గ్రామస్తులు కృష్ణ, శ్రీశైలం, కృష్ణగౌడ్, వెంకటేశం, సాయిలు, శంకరయ్య, కోటేశ్, వడ్డెపోచయ్య, బాల్‌రాజ్, దుర్గయ్య, మల్లేశం, సత్యనారాయణ,శివరాజ్, మహిళలు, యువకులు ప్రజలు పాల్గొన్నారు.

మునిపల్లిలో..
మునిపల్లి: వర్షాలు కురవాలి.. పంటలు బాగా పండాలని మండలంలోని గొర్రెగట్టు గ్రామంలో మహిళలు వర్షాల కోసం గ్రామ దేవతలకు గురువారం బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బుర్కుల పాండు పాల్గొని మట్లాడుతూ గొర్రెగట్టు గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. బోనాల ఊరేగింపు కార్యక్రమంలో పోతరాజుల విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. గ్రామంలో బోనాల ఊరేగింపు కార్యక్రమంలోనే వర్షం కురువడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వీరన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.

వట్‌పల్లిలో..
వట్‌పల్లి: గురువారం మండల పరిధిలోని సాయిపేట గ్రామంలో బోనాల పండుగను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. అందంగా అలంకరించిన బోనాలు, బ్యాండ్ మేళాలు, డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాలతో గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయంలో అమ్మవార్లకు బోనాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు మొక్కుకున్నారు. పాడి పంటలతో గ్రామం చల్లగా ఉండాలని దేవతలను వేడుకున్నారు.

నేడు తాటిపల్లిలో...
మునిపల్లి: శుక్రవారం మండలంలోని ఆయా గ్రామాల్లో బోనాల పండుగ సందర్భంగా గ్రామ దేవతలకు బోనాల ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అల్లం నవాజ్‌రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని మేళసంగం గ్రామంలో విలేకర్లుతో ఆయన మాట్లాడుతూ తాటిపల్లి గ్రామంలో నిర్వహించే బోనాల పండుగ సందర్భంగా ప్రతి ఇంటి నుంచి బోనాలను సమర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై పండుగలో పాల్గొని గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకోవాలని తెలిపారు. అదే విధంగా బోనాల పండుగకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...