అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి


Fri,July 19, 2019 02:37 AM

అందోల్, నమస్తే తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పకడ్బందీగా ఎన్నికలను నిర్వహించాలని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవి అన్నారు. గురువారం అందోలులోని ఓ ఫంక్షన్ హాల్‌లో అందోలు, పుల్కల్, వట్‌పల్లి, హత్నూర మండలాలకు చెందిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల్లో అధికారులు పాటించాల్సిన పద్ధతులు, నిర్వహణ విధుల గురించి క్షుణ్ణంగా వివరించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అధికారులు చూడాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న సమయంలో అ జాగ్రత్తగా వ్యవహరించకూడదని, చిన్న విషయాన్నైనా చాలా జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు ఒక రోజు ముందుగానే అధికారులు వెళ్లాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు తప్పనిసరిగా ఉంటాయని, అవే కాకుండా వీడియో చిత్రీకరణ పోలింగ్ ఆరంభం నుంచి పూర్తయ్యే వరకు ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్ల్ అనుమతి లేదని, పీవోలకు మాత్రమే సెల్‌ఫోన్ల్ అనుమతి ఉన్నదని, వాటిని కూడా కేంద్రాల్లో మాట్లాడకూడదని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల ప్రకారమే అధికారులు వ్యవహరించాలని, నిబంధనలను ఉల్లంఘనకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో తాసిల్దార్ బాల్‌రెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మిర్జా ఫసహాత్ ఆలీబేగ్, ఈవోపీఆర్‌డీ శ్రీనివాసరావు, ఎంఈవో కృష్ణ, రిసోర్స్ పర్సన్లు రాజమల్లు, రాములు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...