లెక్కలు చూపని అభ్యర్థులపై ఈసీ కొరడా


Thu,July 18, 2019 03:22 AM

- జిల్లాలో 132 మందిపై అనర్హత వేటు
- జహీరాబాద్‌లో 63.., సదాశివపేటలో 69 మంది
- 2014 ఎన్నికల్లో ఖర్చులు సమర్పించలేదని వెల్లడి
- ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి నో
- రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు

సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ : గత 2014 మున్సిపల్ ఎన్నికల వివరాల లెక్కలు చూపని అభ్యర్థులపై ఎన్నికల సంఘం కఠిన నిర్ణయం తీసుకున్నది. ఎన్నికల్లో పోటీచేసిన ప్రతి అభ్యర్థి తన ప్రచార ఖర్చుల లెక్కలను తప్పని సరిగా ఎన్నికల అధికారులకు అప్పగించాలని పలుమార్లు తెలిపినా పట్టించుకోకపోవడంతో తాజా నిర్ణయానికి ఊతమిచ్చింది. గత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడినా, గెలిచినా అభ్యర్థులు తప్పని సరిగా ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం ఖర్చుల లెక్కలను చెప్పాలని అధికారులు చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అభ్యర్థులపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. జిల్లాలో 132మంది అభ్యర్థులపై అనర్హత వేటుపడింది. జహీరాబాద్‌లో 63, సదాశివపేటలో 69మంది అభ్యర్థులపై ఎన్నికల సంఘం తాజా నిర్ణయం అమలు కానున్నది. జిల్లా కేంద్రం సంగారెడ్డి మున్సిపల్‌లో పోటీచేసిన అభ్యర్థులు అనర్హత వేటులో లేకపోవడం ఊరట కలిగిస్తున్నది.

గతంలో పోటీచేసిన అభ్యర్థులు ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా జాబితాలో లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అనర్హతకు గురైన అభ్యర్థులు వచ్చే మూడేండ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని ఎన్నికల సంఘం విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మంది అభ్యర్థులకు ఈ ఏడాది డిసెంబరు 31వరకు, మరికొంత మంది అభ్యర్థులకు వచ్చే 2020 జూన్ 22వ తేదీ వరకు అనర్హత వేటు అమలులో ఉంటుందని పేర్కొన్నది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓడినా, గెలిచినా ఎన్నికల వ్యయ ఖర్చు వివరాలను సకాలంలో ఎన్నికల అధికారులకు అందజేయాలని ఎన్నికల సంఘం సూచిస్తున్నది.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...