యువత రాజకీయాల్లో ముందుండాలి


Wed,July 17, 2019 12:24 AM

మునిపల్లి: నేటి యువత రాజకీయాల్లో ముందుండి మునిపల్లి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు నడుము బిగించి ముందుకు రావాలని జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి అన్నారు. మంగళవారం మునిపల్లిలోని రామ్ మందిరంలో ఆలయం ఆవరణలో మునిపల్లి మండల యువతతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మునిపల్లి మండలంలో యువత రాజకీయాలకు దూరంగా ఉన్నారని యువత రాజకీయ రంగంలో ప్రవేశించి ప్రజలకు సేవ చేసే అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి గ్రామంలో 100మంది యువత సభ్యత్వం నమోదు చేయాలని గ్రామ శాఖ అధ్యక్షులకు సూచించారు. మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నా యువత నేరుగా ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌కు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపి పరిష్కారం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మునిపల్లి మండల మైనార్టీ శాఖ ఉపాధ్యక్షుడు మునిపల్లి గారీబొద్దీన్, మునిపల్లి సర్పంచ్ రమేష్, మల్లికార్జునపల్లి ఎంపీటీసీ ఉల్లిడగడ్డల శివకుమార్, నాయకులు ఉదయ్‌కిరణ్, సతీశ్, నర్సింలు, మౌలానా, ఆనందం తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ను ప్రజలు కుటుంబ పార్టీగా భావిస్తున్నారు
రాయికోడ్: వాయువేగంతో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కొనసాగుతున్నదని రాష్ట్ర టీఆర్‌ఎస్ నాయకుడు ఉదయ్‌కిరణ్ అన్నారు. మంగళవారం రాయికోడ్‌లో ఉన్న మార్కెట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీని తమ కుటుంబ పార్టీగా భావిస్తున్నారన్నారు. రాయికోడ్ మండలంలో టీఆర్‌ఎస్ యువత టార్గెట్‌కు మించి సభ్యత్వాలు నమోదు చేస్తున్నారన్నారు. సమావేశంలో రాష్ట్ర జాగృతి కార్యదర్శి భిక్షపతి, జిల్లా టీఆర్‌ఎస్వీ కార్యాదర్శి నాజీంపాటిల్, సింగితం ఎంపీటీసీ నిరంజన్‌తో పాటు వివిధ గ్రామాల యువకులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...