భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి


Wed,July 17, 2019 12:24 AM

అందోల్, నమస్తే తెలంగాణ: పద్మశాలీ సంఘానికి నూతన భవనం, శ్మశాన వాటిక నిర్మాణానికి నిధులను మంజూరు చేయాలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను మంగళవారం అందోలులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పద్మశాలీ సంఘం సభ్యులు కలిశారు. పద్మశాలీ సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు పడిగె సత్యం ఆధ్వర్యంలో సంఘం సభ్యులు ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే పద్మశాలీ సంఘం భవనానికి, శ్మశాన వాటికను ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు.

పద్మశాలీల సభ్యత్వ నమోదు
అనంతరం పద్మశాలీ సంఘం సభ్యుల కోరిక మేరకు తమకు పార్టీ సభ్యత్వాన్ని ఇవ్వాలని, ఎమ్మెల్యేను కోరడంతో ఆయన వారికి పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. టీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని, అన్ని కుల సంఘాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. కార్యక్రమంలో పట్టణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు దూస వెంకటేశం, చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షుడు పడిగె అభినవ్ సత్యం, నాయకులు రాజేందర్, వెంకటేశం, జోగయ్య, నర్సింలు, గోపాల్ తదితరులు ఉన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...