మేమున్నాం..


Tue,July 16, 2019 03:49 AM

సంగారెడ్డి రూరల్: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఎలాంటి సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది. పెద్ద పారిశ్రామిక వేత్తలు సైతం తమ పరిశ్రమల్లో అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి తోడుగా విద్యార్థులు మేమున్నామంటూ వారి సమస్యలకు పరిష్కార మార్గాలు వెతికారు. విద్యార్థులు తయారు చేసిన పరిశోధనలు విజయవంతం కావడంతో నగదు పురస్కారాలు సైతం అందుకుని అందరి మన్ననలు పొందారు. ఇందుకు కంది మండలంలోని ఐఐటీ హైదరాబాద్ వేదికగా నిలిచింది. ఈ నెల 8 నుంచి 12 వరకు ఐదు రోజుల పాటు విద్యార్థులతో కొత్త పరిశోధనలు చేయించారు. కార్యక్రమ నిర్వాహకులు విద్యార్థులకు పలు అంశాలపై ప్రశ్నావలితో కూడిన లిస్టును వారికి అందించి వారికి అవసరమైన అన్ని వసతులు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇందులో గెలిచిన వారికి సోమవారం విజేత జట్ల పేర్లను ప్రకటించి వారికి నగదు పురస్కారాన్ని అందజేశారు.

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2019
కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ మరియు ఇతర ప్రైవేట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2019 కార్యక్రామన్ని నిర్వహించారు. కార్యక్రమంలో దేశంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థుల దరఖాస్తులను ఆహ్వానించారు. మొత్తం యాభై జట్లు ఫైనల్‌కు చేరుకోగా ఇందులో తొమ్మిది జట్లు ఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన హ్యాకథాన్ కార్యక్రమంలో పాల్గొని తమ ఉత్తమ ప్రతినిభను చాటాయి. అయితే పారిశ్రామిక రంగాలకు చెందిన వారు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన ప్రశావళిని ముందుగా సిద్ధం చేసి విద్యార్థులకు అందజేశారు. అందులో పొందుపర్చిన సమస్యల ప్రశ్నలకు విద్యార్థులు తమ పరిష్కారమార్గాన్ని పరిశోధనల ద్వారా ఇచ్చారు. మొత్తం తొమ్మిది జట్లు కార్యక్రమంలో పాల్గొంటే నాలుగు జట్లు విజేతగా నిలిచాయి.

మొదటి స్థానంలో ఆరోహన్ టీం...
పరిశ్రమలలో డిస్‌ప్యాచ్ యూనిట్‌కు ఎక్కువగా మ్యాన్ పవర్ (లేబర్) అవసరముమటుంది. సదరు కంపెనీలు తయారు చేసిన ఉత్పత్తులను డిస్‌ప్యాచ్ చేయాలంటే మ్యాన్‌పవర్‌ను ఎక్కువగా పెట్టి పని చేయుంచాల్సి వస్తుంది. ఇందుకు ఎంతో సమయం పడుతుంది. దీనిని నివారించాలని టీం ఆరోహన్ సభ్యులకు ప్రశ్నావళిని ఇచ్చారు. విద్యార్థులు దీనిపై పని చేసి ఒక సొల్యూషన్‌ను కనుగొన్నారు. తక్కువ సమయంలో ఆటోమేటెడ్ సిస్టమ్‌తో సులువుగా నిల్వ చేయడం, లోడ్ చేసే ప్రకియను పరిశోధించి చూపించారు. ఈ ఉత్తమ పరిశోధనకు గాను టీం ఆరోహన్ సభ్యులను మొదటి విజేతగా ప్రకటించి రూ.లక్ష నగదు పురస్కారాన్ని అందజేశారు. అదేవిధంగా వారు రూపిందించిన పరిశోధను త్వరలోనే కార్యరూపొం తీసుకొస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...