అదిరేలా ఆడిటోరియం


Tue,July 16, 2019 03:48 AM

గజ్వేల్ టౌన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావించిన తర్వాత 2014లో వచ్చిన సాధారణ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్ గెలుపొందడంతో అభివృద్ధి పనులపై ప్రత్యేక చొరవ చూపుతున్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో గజ్వేల్ అన్ని రంగాల్లో అభివృద్ధిలో అగ్రగామిగా గజ్వేల్ దూసుకెళ్తున్నది. ఐదేండ్లలో గజ్వేల్ పట్టణంతో పాటు గ్రామాల్లో వేలాది కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. ప్రధానంగా గజ్వేల్ పట్టణం కనివిని ఎరుగని విధంగా అభివృద్ధి చెందడంతో అన్ని వర్గాల వారికి కలిసోచ్చింది.

రవీంద్రభారతి తరహాలో..
గజ్వేల్ పట్టణంలోని మూట్రాజ్‌పల్లికి వెళ్లే మార్గంలో హైదరాబాద్ రవీంద్రభారతి తరహాలో మహతి ఆడిటోరియం నిర్మాణాన్ని చేపట్టారు. రూ.19.50 కోట్ల వ్యయంతో రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించారు. 1100మంది కూర్చునే సామర్థ్యంతో పాటు 250మందికి సరిపడా మరో మినీ హాల్‌ను ఏసీతో కట్టారు. ఆడిటోరియంలోకి అడుగుపెట్టగానే అందరిని ఆకట్టుకునేలా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కళాకృతులను ఏర్పాటు చేశారు. ఇవి ఎంతగానో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. మహతిలో సభలు, సమావేశాల నిర్వహణ సమయంలో ఎలాంటి సమస్యలు చోటు చేసుకోకుండా సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. మహతిలో అడుగుపెట్టగానే, ఎక్కడో ఉన్నామనే అనుభూతి కలుగుతుంది. పైభాగంలో ఫంక్షన్ హాల్స్‌ను ఏర్పాటు చేయగా, వేర్వేరుగా డైనింగ్ హాళ్లు నిర్మించారు. పైఅంతస్థుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఏర్పాటు చేశారు. గజ్వేల్‌ను గొప్పకళాక్షేత్రంగా తీర్చిదిద్దే క్రమంలో మహతి ఆడిటోరియం ఎంతగానో ఉపయోగపడనున్నది.

తెలంగాణ సంస్కృతి ప్రతిబింబాలు..
మహతి ఆడిటోరియంలో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబాలు ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన కళాఖండాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బతుకమ్మ, బోనం, కోయ, లంబాడి, పోతరాజు, పెర్ని నృత్య దృశ్యాలు అబ్బురపరిచేలా ఉన్నాయి. ప్రహరీ చుట్టూ అందమైన పూల మొక్కలు పెట్టి, మధ్యలో లైట్లను ఏర్పాటు చేయగా, రాత్రిపూట అవి అందంగా కన్పిస్తున్నాయి. ఆడిటోరియం అందుబాటులోకి వస్తే, రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమాలు ఇక్కడ కూడా జరిగే అవకాశాలున్నాయి. ఆడిటోరియంలో సభలు, సమావేశాల నిర్వహణ సమయంలో అక్కడికి వచ్చే వారి వాహనాల పార్కింగ్‌కు అనువైన విధంగా స్థలాన్ని ఏర్పాటు చేశారు.

రూ.2.06 కోట్లతో ప్రతిపాదనలు
మహతి ఆడిటోరియంలో మరో లిఫ్ట్, వెనకాల ఫ్లోరింగ్, ఆవరణలో లైట్లు, మినీ హాల్‌లో 250 సీట్ల ఏర్పాటు, సౌండ్ సిస్టం ఏర్పాటుకు రూ.2.06 కోట్ల గడ నిధుల కోసం ప్రతిపాదనలు పంపించినట్లు ఏఈ నటరాజ్ తెలిపారు. గడ నిధులు విడుదలైతే మహతిలో మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే మహతిని అద్భుతంగా తీర్చిదిద్దడంతో ఎంతో అందంగా కన్పిస్తున్నది.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...