కుటుంబ నియంత్రణ పద్ధతులలో ఇంజక్షన్


Tue,July 16, 2019 03:47 AM

సంగారెడ్డి మున్సిపాలిటీ : మొదటిసారి కుటుంబ నియంత్రణ పద్ధతులలో ఇంజక్షన్‌ను ప్రవేశపెట్టినట్లు జేసీ నిఖిల తెలిపారు. సోమవారం జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా స్థానిక మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో అంతర కార్యక్రమాన్ని జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ పద్ధతులలో ఇంజక్షన్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కుటుంబ నియంత్రణకు ఎలాంటి దుష్ఫలితాలు జరుగకుండా జనాభా అరికట్టడంలో ప్రధాన పాత్ర వహిస్తుందన్నారు. అనంతరం డీఎఆండ్‌హెచ్‌వో మోజీరాంరాథోడ్ మాట్లాడుతూ కొత్తగా పెండ్లి అయిన దంపతులు, బిడ్డల మధ్య ఎడం కోసం ప్రయత్నించే దంపతులు ఈ అంతర పద్ధతిని వాడడం శ్రేయస్కరమన్నారు. ప్రసవం జరిగిన ఆరు వారా ల తర్వాత ఈ ఇంజక్షన్‌ను ఇవ్వాలన్నారు. ఈ విధంగా ప్రతి మూడు నెలలకొకసారి అంతర ఇంజక్షన్ ఇవ్వడం వల్ల మహిళలు గర్భం దరించకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. తిరిగి గర్భం దాల్చాలనుకుంటే అంతర ఇంజక్షన్ ఆపేస్తే తిరిగి గర్భం దాల్చే అవకాశం ఉంటుందన్నారు. ఇది పూర్తిగా సురక్షితమని ఆయన తెలిపారు. అనంతరం అవసరమైన మహిళలకు అంతర ఇంజక్షన్లను అందజేశారు. ఈ సమాచారాన్ని గ్రామస్థాయి వరకు ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు అందజేసి అంతర కార్యక్రమాన్ని విజయంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సంగారెడ్డి, ఎంసీహెచ్ ప్రత్యేకాధికారి డాక్టర్ గాయత్రీదేవి, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...