దూసుకెళ్తున్న టీఆర్‌ఎస్


Tue,July 16, 2019 03:46 AM

పటాన్‌చెరు రూరల్, నమస్తే తెలంగాణ : వాయువేగంతో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతున్నది. టీఆర్‌ఎస్ నాయకుడు గూడెం మధుసూదన్‌రెడ్డి అన్నారు. సోమవారం పటాన్‌చెరు పట్టణంలో ఆయన పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌తో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వద్ద కు ప్రజలు వచ్చి టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును తీసుకున్నా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ హాయంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ముందున్నదన్నారు. సంక్షే మ పథకాల అమలుతో పాటు వివిధ పథకాలతో సామాన్య ప్రజలు లబ్ధి పొందారన్నారు. ఏ వీధికి వెళ్లిన ప్రజలు టీఆర్‌ఎస్ సభ్యత్వం కావాలని అడిగి తీసుకుంటున్నారన్నారు. పటాన్‌చెరు పట్టణంలో టీఆర్‌ఎస్ యువత టార్గెట్‌కు మిం చి సభ్యత్వాలను నమోదు చేస్తున్నారన్నారు. మైనార్టీల్లోనూ మంచి స్పందన ఉందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు రాజన్‌సింగ్, అక్రమ్ పాష, షకీల్ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ను కుటుంబ పార్టీగా భావిస్తున్న ప్రజలు..
రామచంద్రాపురం : టీఆర్‌ఎస్‌ని ప్రజలు కుటుంబ పార్టీగా భావిస్తున్నారని కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం ఆర్సీపురం డివిజన్‌లోని మయూరీనగర్‌లో కాలనీ అసోసియేషన్ సభ్యులతో కార్పొరేటర్ అంజయ్యయాదవ్ సభ్యత్వ నమోదులు చేయించారు. ఈ సందర్భంగా ఆర్సీపురం డివిజన్‌లో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్న వారికి పార్టీ రూ.2 లక్షల ప్రమాద బీమా చేయిస్తుందన్నారు. ప్రజలందరు స్వచ్ఛందంగా పైసలు చెల్లించి పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీ వెంట నడుస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు పరమేశ్‌యాదవ్, నాయకులు మహిపాల్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, బాల్‌రాజ్, విఠల్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, రమేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

శ్రీనివాస్‌నగర్‌కాలనీలో..
ఆర్సీపురం డివిజన్‌లోని శ్రీనివాస్‌నగర్ కాలనీ, కాశిరెడ్డిపల్లి, ఈఎస్‌ఐ ఫెన్సింగ్ ఏరియాలో టీఆర్‌ఎస్ నాయకుడు ఐలేశ్ యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా కాలనీ వాసులు స్వచ్ఛందంగా వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు గఫర్, రాజు, సంతోశ్, అంజయ్య, శ్రీనివాస్, సంతోశ్, సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

జోరుగా టీఆర్‌ఎస్ సభ్యత్వాలు..
జిన్నారం : మండల కేంద్రంలో జోరుగా టీఆర్‌ఎస్ సభ్యత్వాల నమోదు సాగుతుందని జి ల్లా యువత అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్ అన్నా రు. సోమవారం మండలంలోని మం గంపేట లో సర్పంచ్ ప్రశాంతీనరేందర్, ఉప సర్పంచ్ నాగరాజు, ఇన్‌చార్జి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వాల ను నిర్వహించారు. దీనికి ము ఖ్య అతిథిగా జిల్లా యువత అధ్యక్షుడు హాజరయ్యారు. గ్రామంలో యువతి యువకులకు పార్టీ సభ్యత్వాలను నమోదు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వాలను నియోజకవర్గంలో అనుకున్న సంఖ్యకంటే మించి సభ్యత్వాలను చేయిస్తున్నామన్నారు. మండలంలో ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్ సభ్యత్వాలను తీసుకోవాలని సూచించారు. వీరితో పాటు నాయకులు కత్తుల రవీందర్, మన్నె రఘు, గణేశ్, రతన్‌కుమార్, వెంకటరమణ, వెంకటేశ్ తదితరులు ఉన్నారు.

టీఆర్‌ఎస్ సభ్యత్వాలకు మంచి స్పందన..
గుమ్మడిదల : గ్రామాల్లో టీఆర్‌ఎస్ సభ్యత్వాలకు మంచి స్పందన లభిస్తుందని సర్పంచ్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని దోమడుగులో సర్పంచ్ అభిశెట్టి రాజశేఖర్, టీఆర్‌ఎస్ మండల నాయకుడు మంగయ్యలు పార్టీ సభ్యత్వాలను నమోదు చేయించారు. గ్రామంలో యువతకు పెద్ద సంఖ్యలో సభ్యత్వాలను నమోదు చేయిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక టీఆర్‌ఎస్ కార్యకర్త ఉండే వి ధంగా పార్టీ సభ్యత్వాలను నమోదు చేయిస్తున్నట్లు తెలిపా రు. సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాలను తీసుకోవడానికి యువత ముందుకు వస్తున్నారని తెలిపారు. వీరితో పాటు గ్రామ కమిటీ అధ్యక్షుడు పట్నం లింగం తదితరులు ఉన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...