ఫసల్‌బీమాను సద్వినియోగం చేసుకోవాలి


Tue,July 16, 2019 03:46 AM

గుమ్మడిదల : వానకాలం సీజన్‌లో సాగు చేసే పంటలకు రైతులు తప్పనిసరి బీమా చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి జావీద్ సూచించారు. సోమవారం మండలంలోని మంభాపూర్‌లో రైతులకు ప్రధానమం త్రి ఫసల్ బీమా యోజనపై వ్యవసాయాధికారులు అవగాహన కలిగించా రు. వర్షకాలంలో సాగు చేసుకునే వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలకు రాష్ట్ర ప్రభుత్వం బీమా సౌకర్యాన్ని కల్పించిందని ఎంఈవో నిఖిత తె లిపారు. వివిధ పంటలకు బీమాను ఏవిధంగా నమోదు చేసుకోవాలో రైతులకు వివరించారు. ప్రకృతి వైఫరిత్యాల వల్ల రైతులు సాగు చేసుకున్న పంటలకు నష్టం వాటిల్లితే ఈ బీమా ఆదుకుంటుందని తెలిపారు. రైతులు బ్యాం కుల్లో ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా నగదు చెల్లించి బీమా చేసుకోవాలని సూచించారు. ఎకర వరి పంటలకు రూ.680, మొక్కజొన్నకు రూ.500, కందులకు/ జొన్నకు రూ.280, పెసర/మినుములకు రూ. 300 చొ ప్పున ప్రీమియం చెల్లించవలసి ఉంటుందన్నారు. ప్రతి రైతు తమ పంటలకు బీమా చేయించుకోవాలన్నారు. ఇందులో సర్పంచ్ కంజర్ల శ్రీనివాస్, ఉపసర్పంచ్ దయానంద్, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...