టీఆర్‌ఎస్ సభ్యత్వానికి విశేష స్పందన


Tue,July 16, 2019 03:46 AM

అమీన్‌పూర్ : రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కి ఎక్కడ చూసినా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని పటాన్‌చె రు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం కాంగ్రెస్‌కు చెందిన మాజీ వార్డు సభ్యుడు బా శెట్టి కృష్ణ ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా అమీన్‌పూర్ పరిధిలోని హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణ అమీన్‌పూర్ నరేంద్రనగర్ కాలనీకి చెందిన మరికొందరు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భం గా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందని అన్నా రు. ప్రజలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని చూసే ప్రజలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. కేసీఆర్ సారథ్యం లో రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌దే అధికారమని తెలిపారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించి ఓటు వేస్తున్నారని, అందుకే సీఎం కేసీఆర్ సుభిక్షమైన పాలనను అందిస్తున్నారని తెలిపారు. మి షన్ భగీరథతో ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిని సరఫరా చేయడం జరుగుతుందని, మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం వస్తుందన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో ఐదేండ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, సీఎం కేసీఆర్ సహకారంతో ముందు ముందు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారిలో ఉప్పలపాటి మోహన్ రావు, ఉమా వెంకటేశ్వర్ రావు, వి.మదన్ మోహన్‌రావు, సుబ్బారెడ్డి, మల్లారెడ్డి, నాగరాజు, మల్లేశ్, మధు, గంగాధర్‌రెడ్డి, గణేశ్, విజయ కృష్ణ, రమేశ్, కె.మహేశ్‌గౌడ్, టి.యాదగిరి, ఎం.వెంకటేశ్, ఎన్.వీరేశ్, బి.చిన్న, ఎస్.యాదగిరి, టి.నర్సింహ, కె.భిక్షపతి, కె.వినోద్ కుమార్, ఆర్.విఠల్, సార విఠల్, ఎం.రాజులు ఉన్నారు.
కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల పాండురంగారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సింహాగౌడ్, మాజీ ఎంపీటీసీలు కొల్లూరి మల్లేశ్, కవితాశ్రీనివాస్‌రెడ్డి, బాలరాజు, అనిల్, బాల్‌రెడ్డి, యూనుస్, ఆసిఫ్, టీఆర్‌ఎస్ నాయకులు నర్రా భిక్షపతి, వడ్ల కాలప్ప, చంద్రశేఖర్ రెడ్డి, తలారి రాములు, దాసు యాదవ్, నీలం భిక్షపతి, ప్రకాశ్, యాదగిరి, యాదయ్యగౌడ్, మహేశ్‌గౌడ్, సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...