రైతులకు అందుబాటులో ఉండాలి


Tue,June 18, 2019 11:16 PM

సంగారెడ్డి చౌరస్తా: జిల్లాలోని రైతులకు అధికారులు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని వ్యవసాయశాఖ అధికారులకు కలెక్టర్‌ హనుమంతరావు సూచించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వానకాలం 2019 పథకాలపై నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడునతూ వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లోనే రైతులతో మమేకమై ఉండాలన్నారు. అదే విధంగా రైతులకు కావాల్సిన సమగ్ర సమాచారం తెలియజేయాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో అధికారులు ప్రభుత్వ పథకాలను రైతులకు వివరించాలన్నారు. క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి వాటికి అనుకూలంగా ఏ పంటలు వేయాలో తెలియజేయాలని చెప్పారు. గ్రామ అధికారులు, వ్యవసాయ అధికారుల మొబైల్‌ ఫోన్‌ నెంబర్‌ను రైతులకు చెప్పాలన్నారు. రైతులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఫోన్‌లో అందుబాటులో ఉండి సమస్యను పరిష్కరించాలన్నారు. రైతుబంధు, రైతుబీమా, ప్రభుత్వ పథకాలను సకాలంలో అందించాలన్నారు. రైతు సదస్సులు ఏర్పాటు చేసి అక్కడిక్కడే సమస్యలు పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో పాల్గొనే అధికారులకు, రైతు సమస్యలు పరిష్కరించే వారికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. అధికారులు, రైతులను ఎవరైనా ఇబ్బంది పెట్టిన యెడల కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో జేసీ నిఖిల, వ్యవసాయాధికారి నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...