బాల్య వివాహాల చేయొద్దు


Tue,June 18, 2019 11:16 PM

జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భవానీ
సంగారెడ్డి టౌన్‌: బాల్య వివాహాల రహిత గ్రామాలుగా మార్చాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి భవానీ అన్నారు. మంగళవారం మెడ్వాన్‌ నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని మహిళా ప్రాంగణంలో సర్పంచ్‌లతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలను బాల్య వివాహాల రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్‌లు కృషి చేయాలన్నారు. అంతేకాకుండా బాలికలు సెకండరీ ఎడ్యూకేషన్‌ చదివేలా ప్రోత్సహించాలన్నారు. ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన కల్పించాలని, ఇక ముందు బాల్య వివాహాలు, బాలికల అక్రమ రవాణా, సెకండరీ ఎడ్యూకేషన్‌ అంశంపై సుస్థిరమైన ప్రణాళికను తయారు చేసుకోవాలన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ మోతీ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో బాలికల సమస్యలపై కమిటీలు వేయడమే కాకుండా వాటిని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కమిటీల బాధ్యతలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీసీపీవో రత్నం, మెడ్వాన్‌ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌, రోహిణి, లక్ష్మీప్రియ, విజయరేఖ, యాదగిరి, లక్ష్మణ్‌, నవీన్‌ పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...