రైతులు పశుసంపదను పెంచుకోవాలి


Tue,June 18, 2019 11:16 PM

-అన్ని కులాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి
-విజయడెయిరీలో పాలు విక్రహించాలి
-ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి
కల్హేర్‌: వ్యవసాయానికి అనుసందానంగా పశుసంపదను పెంచుకునే దిశగా రైతులు కృషి చేయాలని, అన్ని కులాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఏనలేని కృషి చేస్తున్నారని ఖేడ్‌ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఖానాపూర్‌ కే గ్రామంలో పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడిపంటలతో పాటు పశు సంపదను వృద్ధి చేసుకునేందుకు రైతులు కృషి చేయాలని అందుకు ప్రభుత్వం చేయూతనందిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతంలో గొల్లకురుమలు గొర్రెల పెంపకంతో జీవనం కొనసాగిస్తున్నారని, గొల్లకురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్‌ సబ్సిడీపై గొర్రెలను అందజేశారని పేర్కొన్నారు.

దేశంలో వివిధ రాష్ర్టాల్లో యాదవులు పాలించారని యాదవులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గొర్రెల పథకం కింద పొందిన గొర్రెలు మృతి చెందిన కాపరులకు తిరిగి గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. పాడిరైతులు పాలను విజయడెయిరీలో విక్రయించుకోవాలని సూచిస్తూ రూ.4 ఇన్సెంటివ్‌ అందజేస్తున్నారన్నారు. అదే విధంగా రైతులకు వారం రోజులకు చెల్లించేదని, కానీ ప్రస్తుతం రోజు వారీగా చెల్లిస్తున్నారన్నారు. మంజూరైన యూనిట్లను గొర్రె కాపరులకు పంపిణీ చేయగానే యూనిట్లు పొందని గొర్రెకాపరులకు యూనిట్లలను అందజేస్తామన్నారు. గొర్రెలు, మేకలకు మేత కోసం ప్రభుత్వం ఉచితంగా గడ్డి విత్తనాలను సరఫరా చేస్తుందని రైతులు విత్తనాలను విత్తుకొని మేత కొరతను తీర్చుకోవాలని సూచించారు.

పశుసంవర్ధక శాఖ జేడీ రామారావు రాథోడ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో గొర్రెల యూనిట్లు మంజూరు అయ్యాయన్నారు. జిల్లాలో 8లక్షలు గొర్రెలు, 3లక్షలు మేకలను పంపిణీ చేశామన్నారు. అవగాహన లోపంతో రైతులు ఎక్కువ మోతాదులో మందులు వాడడంతో నష్టపోతురన్నారు. వైద్యులు సూచన మేరకు మందులను సరైన మోతాదులో వాడుకోవాలని సూచించారు. 6రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని పశువులకు ఏదైన సమస్య తలెత్తితే వైద్యులచే వైద్యం చేయించాలన్నారు.

కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మానిటరింగ్‌ అధికారి భాస్కర్‌, ఏడీఏ సుబ్రమణ్యం, ఖానాపూర్‌ సర్పంచ్‌ కవిత, కల్హేర్‌, సిర్గాపూర్‌ జడ్పీటీసీలు నర్సింహారెడ్డి, రాఘవరెడ్డి, జిల్లా, మండల కో ఆప్షన్‌ మెంబర్లు అలీ, ఘని, మండల ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, కల్హేర్‌ ఎంపీటీసీ సంగప్ప, బీబీపేట్‌, కృష్ణాపూర్‌ సర్పంచ్‌లు కిష్టారెడ్డి, రవీందర్‌రెడ్డి, సగరుల సంఘం రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు అంజయ్యసాగర్‌, కల్హేర్‌ ఉప సర్పంచ్‌ సాయిలు, నాయకులు రాంసింగ్‌, జలంధర్‌, వెంకటేశంగుప్తా, అంజిరెడ్డి, సంగారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, బాలయ్య, నవాబ్‌ పటేల్‌, కురుమ సాయిలు, బేగరి సాయిలు, మోహన్‌సాగర్‌, నారాయణ, గొల్లకురుమ సంఘం అధ్యక్షుడు బాపల్లి విఠల్‌, జుమ్మ రాములు, పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...