సర్కారు బడుల్లో ఉత్తమ బోధన


Mon,June 17, 2019 11:34 PM

అందోల్, నమస్తే తెలంగాణ: విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎంఈవో బండి కృష్ణ అన్నారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమలో భాగంగా మండలంలోని రోల్లపాడు, తాలెల్మ గ్రామాల్లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ పేదవిద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయడంతోపాటు మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు పలు విద్యా సామగ్రి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు లింగంగౌడ్, నర్సింహులు, ఎస్‌ఎంసీ చైర్మన్‌లు సంజీవులు, మరియమ్మరాజు, హెచ్‌ఎం రాజమల్లు, సంగప్ప, ఉపాధ్యాయులు రవీందర్, జ్యోత్స్న, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం
హత్నూర: మండలంలోని పలుప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు, సర్పంచ్‌లు నిర్వహించారు. విద్యార్థులతో సరస్వతీ పూజ చేయించి ఓనమాలు నేర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సర్పంచ్‌లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

దుద్యాలలో..
వట్‌పల్లి: మండలంలోని దుద్యాల ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా పాఠశాలలో చేరిన విద్యార్థులతో అక్షరాలు దిద్దించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పత్రి విఠల్, సర్పంచ్ శంకర్, ఉప సర్పంచ్ సంజీవ్, పాఠశాల హెచ్‌ఎం విఠల్, సిబ్బంది శ్రీనివాస్‌రావు, నాగజ్యోతి, నిర్మల, ఎస్‌ఎంసీ చైర్మన్ ప్రవీణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

బడిబాటలో అక్షరాభ్యాసం
పుల్కల్: మండలంలో సోమవారం బడిబాట సందర్భంగా పాఠశాలలో అక్షనాభ్యాసం నిర్వయించారు. కార్యక్రమంలో స్కూల్ మెనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్లు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. చక్రియాలలో సర్పంచ్ కిష్టారెడ్డి, ఎస్ ఇటిక్యాలలో సర్పంచ్ రాదయ్య పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించి పలుకలు, పుస్తకాలు పంపిణీ చేశారు.

ప్రభుత్వ బడిలోనే ఉత్తమ విద్య...
మునిపల్ల్లి: ప్రభుత్వ బడిలోనే ఉత్తమ విద్య లభిస్తుందని మునిపల్లి ఎంఈవో దశరథ్ తెలిపారు. సోమవారం మండలంలోని ప్రభుత్వ బడులల్లో సమూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లోనే ఉత్తమమైన విద్య బోధిస్తారన్నారు. కాగా, అంతారం, మొగ్దుంపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు శంకర్, ఆశోక్‌లు విద్యార్థులతో కలిసి అక్షరాభాస్యం చేయించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బల్‌రాజు, సత్యనారాయణలు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...