20న పారిశ్రామికవేత్తలకు అవగాహన


Mon,June 17, 2019 11:34 PM

సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ : ఉమ్మడి జిల్లాలో వివిధ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసే పారిశ్రామికవేత్తలకు ఈ నెల 20న అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ రిషికేశ్ సోమవారం తెలిపారు. ఈ అవగాహన సదస్సు పటాన్‌చెరులోని టీఎస్‌ఐఐసీ సమావేశ మందిరంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు సంబంధించిన తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న పారిశ్రామికవేత్తలకు సలహాలు, సూచనలు అందించేందుకు అవగాహన సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సును ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో జరగుతుందన్నారు. తమ ఉత్పత్తులను పరిశ్రమలకు ఈ అవగాహన సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని, ఎక్స్‌పోర్ట్ పాలసీని రూపొందించడానికి పారిశ్రామికవేత్తల సూచనలు, సలహాలు పొందాలని కోరారు. అలాగే తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ అధికారులు సదస్సుకు హాజరై పారిశ్రామికవేత్తలకు సలహాలు, సూచనలు అందజేస్తారన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఉత్పత్తులను ఎగుమతి చేసే పారిశ్రామికవేత్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని డీఐసీ మేనేజర్ కోరారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...