ఘనంగా ఏరువాక పండగ


Mon,June 17, 2019 11:34 PM

రాయికోడ్: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సోమవారం ఘనంగా ఏరువాక పండుగను నిర్వహించుకోన్నారు. రైతులు తమ పశువులను అందంగా అలంకరించుకున్నారు. ముందుగా తమ పశువులకు ప్రత్యేకంగా తయారు చేసిన పుల్గం నైవేద్యం పెట్టి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వరుణ దేవుడు కరిణించి వర్షాలు సంవృద్ధిగా కురిసి తమ పొలాల్లో పంటలు బాగాపండాలని గ్రామా దేవతలకు పూజలు చేసి పశువులతో, ఎడ్ల బండ్లతో ఊరేగింపు నిర్వహించారు.

వట్‌పల్లి మండలంలో..
వట్‌పల్లి: ఏరువాకపౌర్ణమి (ఎరొక్కపున్నం) పండుగను సోమవారం మండల వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఎడ్ల మెడల్లో గంటల మోతలతో సోమవారం గ్రామాలన్నీ మార్మోగాయి. పండుగా సందర్భంగా రైతులు ఉదయం పూట ఎడ్లకు పిండివంటలతో భోజనాలు పెట్టి, పొలాల్లో దేవతమూర్తులకు నైవేధ్యాలు సమర్పించారు. వర్షాలు సంవృద్ధిగా కురిసి పాడి పంటలతో గ్రామాలు చల్లగా ఉండాలని కోరుకున్నారు. సాయంత్రం సమయంలో రైతులు తమ పశువులను రంగురంగుల తాళ్లు, అలంకరణ సామగ్రితో అందంగా అలంకరించారు. అనంతరం డప్పుచపుళ్లు, బ్యాండ్‌మేళాలతో తీన్మార్ డ్యాన్స్‌లు చేస్తూ గ్రామాల్లోని దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. ఉదయం ఇండ్లలో పూజలు నిర్వహించిన రైతులు అనంతరం తెప్పలలో నైవేధ్యాలు పెట్టి నీటిలో వదిలుతూ మొక్కులు చెల్లించుకున్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...