సమస్యల పరిష్కరానికి భూవాణి


Mon,June 17, 2019 11:34 PM

కోహీర్ : భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి భూవాణిని నిర్వహిస్తున్నామని జడ్పీ సీఈవో రవి, ఆర్డీవో అబ్దుల్ హమీద్ పేర్కొన్నారు. సోమవారం కోహీర్ పట్టణంలోని భారత్ ఫంక్షన్ హాలులో భూవాణి కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో రవి, ఆర్డీవో అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ముద్రించడంలో కొంత వరకు తప్పులు దొర్లాయని వాటిని తమ దృష్టికి తెచ్చిన వెంటనే సరి చేస్తున్నామని చెప్పారు. డబుల్ ఖాతాలను కూడా సరి చేశామన్నారు. ఎక్కడైనా మిగిలితే సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. పట్టా పుస్తకంలో యజమాని పేరు, ఇంటిపేరు, ఎకరాల్లో హెచ్చు తగ్గులు ఉన్నా వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో భూవాణి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. భూ సంబంధిత సమస్యలున్న ప్రతిఒక్కరూ భూ వాణిని వినియోగించుకోవాలని సూచించారు. తాము ఏర్పాటు చేసిన భూ వాణికి 958మంది దరఖాస్తులు సమర్పించారని వెల్లడించారు. ఇందులో 155 సమస్యలను పరిష్కరించామని మిగతా వాటిని ఐదారు రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. రైతుబంధు పెట్టుబడి సహాయం అందించేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. ఎస్‌ఐ రాము ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. మండల వైద్యాధికారి డా.రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో వైద్యసేవలందించారు. తహసీల్దార్ సైదులు, నాయబ్ తహసీల్దార్ బస్వరాజ్, ఎంపీడీవో వెంకట్‌రెడ్డి, ఏవో నవీన్‌కుమార్, గిర్ధావర్ మహేశ్, వీఆర్వోలు, వీఆర్‌ఏలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...