చదువుకుంటేనే భవిష్యత్


Mon,June 17, 2019 11:34 PM

పటాన్‌చెరు రూరల్, నమస్తే తెలంగాణ : చదువుకుంటేనే భవిష్యత్ ఉంటుందని డీఈవో విజయలక్ష్మి అన్నారు. సోమవారం పటాన్‌చెరు మండ లం రుద్రారం గ్రామంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని పాఠశాలలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఈవో విజయలక్ష్మి, గ్రామ సర్పంచ్ సుధీర్‌రెడ్డిలతో కలిసి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ జిల్లాలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్చాలని ఆమె కోరారు. చదువుతోనే ఉజ్వలమైన భవిష్యత్ ఉం టుందన్నారు.బడిబాట కార్యక్రమానికి విశేష స్పందన వస్తున్నదన్నారు. వేలాదిమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు వస్తున్నారని తెలిపారు. రుద్రారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెద్దసంఖ్యలో చదువుతుండడం సంతోషకరం అన్నారు. సర్పంచ్ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ రుద్రారం గ్రామానికి పూర్వవైభవం తీసుకుని వచ్చేందుకు తాను కృషి చేస్తున్నానన్నారు.

దాతలను సంప్రదించి నిధులను తెచ్చి పాఠశాలను అదర్శ పాఠశాలగా మారుస్తామన్నారు. ఎంఈవో రాథోడ్ మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ పాఠశాలలు అన్నిరంగాల్లో మెరుగ్గా ఉన్నాయన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా 50 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. విద్యార్థులకు పలకలు, పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో అనంతరెడ్డి, ఉప సర్పంచ్ పి.యాదయ్య, ప్రధానోపాధ్యాయుడు రమాదేవి, సుచిత్ర, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...