భూమి సర్వే చేసి న్యాయం చేయండి


Mon,June 17, 2019 11:33 PM

సంగారెడ్డి చౌరస్తా: తన భూమి సర్వేచేసి న్యాయం చేయాలని పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన మల్లేశంగౌడ్ అధికారులతో మొరపెట్టుకున్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం నిర్వహించే ప్రజావాణిలో భాగంగా సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు అర్జీదారులు తరలివచ్చారు. తమ ఫిర్యాదులు, అర్జీలను అధికారులకు అందజేసి సకాలంలో పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బస్వాపూర్ వాసి తన అర్జీని అందజేస్తూ తనకు గల 9.13 ఎకరాల భూమికి సంబంధించి సర్వే చేయాలని గతేడాది నుంచి అధికారుల చుట్టు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సర్వే అధికారులతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడంలేదని పేర్కొన్నారు. వెంటనే తన భూమిని సర్వే చేసి న్యాయం చేయాలని కోరారు. గ్రీవెన్స్‌లో అందిన మరికొన్ని ఫిర్యాదులు ఈ విధంగా ఉన్నాయి.
-కొండాపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన లక్ష్మి తన అర్జీని అందజేస్తూ అనారోగ్యం కారణంగా తన భర్త మృతిచెందాడని పేర్కొన్నారు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న తనకు కూడా ఆరోగ్యం బాగాలేన్నందున డబుల్ బెడ్‌రూం ఇల్లు మం జూరు చేసి ఉపాధి కల్పించాలని కోరారు.

-తన కూతురుకి గురుకులంలో సీటు ఇప్పించాలని కొండాపూర్ మండలం తొగర్‌పల్లి గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడు బుచ్చయ్య అధికారులకు విజ్ఞప్తి చేశారు.
-న్యాల్‌కల్ మండలం రాజోల్ గ్రామానికి చెందిన బి.ప్రకాశ్ తన అర్జీని అందజేస్తూ సర్వే నెంబర్ 69లో 6గుంటల భూమి పంచాయతీరాజ్ వారు 2008లో రోడ్డు కోసం తీసుకున్నారని, అయితే ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించనందున న్యాయం చేయాలని వేడుకున్నారు.

-నారాయణఖేడ్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన భీంరెడ్డి తన అర్జీని అందజేస్తూ తన తండ్రి రాంరెడ్డికి నలుగురు పిల్లలు కాగా, తనతో పాటు జ్ఞానారెడ్డి వలస వెళ్లామని, ఇంటి వద్ద ఉన్న మరో ఇద్దరు సోదరులు తమ నాన్న పేరున ఉన్న 39.29 ఎకరాల భూమిని వారి పేరున అక్రమంగా చేయించుకున్నారని వివరించారు. వెం టనే తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయా అర్జీలను స్వీకరించిన జిల్లా సం యుక్త కలెక్టర్ నిఖిల వాటిని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...