భర్త నుంచి మెయింటెనెన్స్ ఇప్పించాలి


Mon,June 17, 2019 11:33 PM

సంగారెడ్డి టౌన్ : తన భర్తపై 2007 సంవత్సరంలో మెయింటెనెన్స్ కేసు వేశానని, 2009 సంవత్సరంలో ప్రతినెలా రూ.3500 ఇస్తానని ఒప్పుకుని ఇవ్వడంలేదని, అతనిపై చర్యలు తీసుకుని మెయింటెనెన్స్ ఇప్పించాలని రాయికోడ్ మండలానికి చెందిన ఓ ఫిర్యాదురాలు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సోమవారం నిర్వహించిన పోలీసు గ్రీవెన్స్‌కు జిల్లాలోని పలు మండలాల నుంచి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి ఫిర్యాదులు అందజేశారు. అవి ఇలా ఉన్నాయి.
- తనభర్తపై మెయింటెనెన్స్ కేసు వేయగా, 2009 సంవత్సరంలో ప్రతినెలా 3,500 తన కుమారుడి ఖర్చుల కోసం ఇస్తానని ఒప్పుకున్నారని, కానీ పలుమార్లు నోటీసులు పంపినా డబ్బులు ఇవ్వడంలేదని, తన కుమారుడి స్కూల్ ఫీజు కట్టలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని రాయికోడ్ మండలానికి చెందిన ఓ ఫిర్యాదురాలు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

-తాను రిటైర్డ్ ఉద్యోగినని, తనపై కొంత మంది కులస్తులు కక్ష్యకట్టి కులం నుంచి వెలివేశారని, ఏ శుభకార్యానికి రానివ్వడంలేదని, దీనివల్ల తాము ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నామని, తన కుటుంబాన్ని బహిష్కరించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని సంగారెడ్డి మండలానికి చెందిన ఓ ఫిర్యాదుదారుడు ఎస్పీకి వినతిపత్రం అందజేశారు.

-తాము ముగ్గురం అన్నదమ్ములమని, పెద్దల నుంచి సంక్రమించిన భూమిని ముగ్గురం సమానంగా పంచుకున్నామని, తన అన్న అతని వాటాను అవసరాల నిమిత్తం తనకు అమ్మి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడని, కానీ ప్రస్తుతం ఆ భూమిని తనకు అమ్మడానికి ముందే మా వదినకు గిఫ్ట్ రిజిస్ర్టేషన్ చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, చట్ట ప్రకారం తనకు న్యాయం చేయాలని కంగ్టి మండలానికి చెందిన ఓ ఫిర్యాదుదారుడు ఎస్పీకి వినతిపత్రం అందజేశారు.

-తన తండ్రికి ఇద్దరం కొడుకులమని, తన మరణానంతరం తన తమ్ముడు తనకు తెలియకుండా భూమి పట్టా అతని పేరుపై రాయించుకున్నాడని, తన వాటా తనకు ఇవ్వమని అడిగితే కాలయాపన చేస్తున్నారని, అతనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పుల్కల్ మండలానికి చెందిన ఓ ఫిర్యాదుదారుడు ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని ఎస్పీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...