మొక్కలను నాటేందుకు సన్నద్ధం కావాలి


Mon,June 17, 2019 11:33 PM

న్యాల్‌కల్ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో మొక్కలను నాటేందుకు సన్నద్ధం కా వాలని ఎంపీడీవో రాజశేఖర్ అన్నారు. సోమవా రం న్యాల్‌కల్‌లోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, ఉ పాధి హామీ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రా ష్ట్రంలో అడవులను పెంచాలనే లక్ష్యంతో ప్రభు త్వం నాలుగేండ్లుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందన్నారు. ఐదో విడుత హ రితహారం కార్యక్రమంలో గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, పాఠశాలలు, భవనాలు, కార్యాలయా లు, చెరువు గట్లు, పంచాయతీ రహదారుల వెంట మొక్కలను నాటాలన్నారు. మండల పరిధిలో 40 వేల మొక్కలను నాటేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. అలాగే ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించాలన్న లక్ష్యాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 25వ తేదీలోగా గ్రామాల్లో మరుగుదొడ్డి నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఈజీఎస్ ఏ పీవో రంగారావు, ఈసీ హన్మంతు, సీసీలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...