సర్కార్ బడికే పిల్లలను పంపించండి


Mon,June 17, 2019 11:33 PM

న్యాల్‌కల్ : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మండల విద్యాధికారి మారుతీరాథోడ్ అన్నారు. సోమవారం ప్రొ.జయశంకర్ బ డిబాటలో కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంతో పా టు రేజింతల్, మామిడ్గి, రాజోల, హద్నూర్, మిర్జాపూర్ (బీ), మెటల్‌కుంట, చాల్కి తదితర గ్రామాల్లో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసాన్ని చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పా ఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజ నం, ఉచిత పుస్తకాలు, ప్రతిభవంతులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను బోధిస్తున్నారని, పాఠశాలల్లో విద్యార్థులకు కోసం అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తుందన్నారు. బడిబాట కార్యక్రమంలో గ్రామాల సర్పంచ్‌లు, విద్యాకమిటీ చైర్మన్‌లు, నాయకులు, విద్యావంతులు, యు వజన సంఘాల సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామాల ప్రజాప్రతినిధులు జగన్నాథ్‌రెడ్డి, చంద్ర న్న, శరణయ్యస్వామి, విద్యాకమిటీ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసం...
కోహీర్ : చిన్నారులు ఉల్లాసంగా, ఉత్సాహంగా చదువుకోవాలని మండల విద్యాధికారి శంకర్ కోరారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలతో పాటు పలు గ్రామాల పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ చిన్నారులందరూ తమ ఆట పాటలతో ప్రతిరోజూ బడికి వచ్చి చదువుకోవాలని సూచించారు. విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వం దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం తదితర అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు.

సర్కార్ బడిలో 50 మంది విద్యార్థుల చేరిక...
ఝరాసంగం : ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందుతుందని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రధానోపాధ్యాయులు విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఝరాసంగం ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రారంభం నుండి ఇప్పటివరకు 6 నుంచి 10వ తరగతి వరకు 50 మంది విద్యార్థులను అడ్మిషన్ చేసుకున్నామన్నారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు, రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. అలాగే బడిబాట కార్యక్రమాన్ని మంచి స్పందన వచ్చిందన్నారు. కార్యక్రమంలోఉపాధ్యాయులు రాంచందర్‌భీంవంశీ, నాగేశ్వర్‌రావు, బసప్ప తదితరులు ఉన్నారు.

చిన్నారులకు అక్షరాభాస్యం...
మండల పరిధిలోని కప్పాడ్, కృష్ణాపూర్, పోట్‌పల్లి, మాచూనూర్, మేదపల్లి, అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలో సోమవారం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చే శారు. కార్యక్రమంలో నూతన ఎంపీపీ దేవాదాసు, మేదపల్లి సర్పంచ్ పరమేశ్వర్, పంచాయతీ కార్యదర్శి శివశంక్, ప్ర ధానోపాధ్యాయులు సుధాకర్, నర్సింహులు, ఉపాధ్యాయు లు రవి, బాల్‌శెట్టి, వెంకట్‌రావు, శ్రీ రాములు, నాగయ్య, నిర్మల, అంగన్‌వాడీ టీచర్లు తదితరలు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...