మెరుగైన వైద్య సేవలందించాలి


Mon,June 17, 2019 11:33 PM

-డా.గాయత్రీదేవి
కోహీర్ : దవాఖానకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా మాతాశిశు సంరక్షణ అధికారి డా.గాయత్రీదేవి కోరారు. సోమవారం మండలంలోని దిగ్వా ల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా డా.గాయత్రీదేవి మాట్లాడుతూ గర్భిణులు 16 వారాల్లో తమ పేర్లను సంబంధిత దవాఖానల్లో నమోదు చేయించాలని వైద్య సిబ్బందిని కోరా రు. మాతా శిశు మరణాల శాతాన్ని పూర్తిగా తగ్గించాలన్నారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని కోరారు. అనంతరం దవాఖానలోని రికార్డులను పరిశీలించారు. దిగ్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణను పరిశీలించి గొటిగార్‌పల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేశారు. అందులో ఉన్న రికార్డులను పరిశీలించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. శ్రీనివాస్‌రెడ్డి, వైద్య సిబ్బంది ఉన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...