నేడే ఏరువాక పూర్ణిమ


Mon,June 17, 2019 12:32 AM

వట్‌పల్లి: సోమవారం ఎరొక్కపున్నం (ఏరువాకపౌర్ణమి) పండుగను ఘనంగా జరుపుకునేందుకు పల్లెలు సిద్ధమవుతున్నాయి. సోమవారం ఎరొక్కపున్నం పండుగ ఉండడంతో ఆదివారం వట్‌పల్లితో పాటు అన్ని గ్రామాల్లో ఎక్కడ చూసిన రైతులు ఏరువాక పండుగకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేస్తూ బిజీ ...బిజీగా కనిపించారు. మృగశిర కార్తె ప్రారంభమై పొలాల్లో పంటలను సాగు చేసే సమయంలో వచ్చే ఈ ఏరువాక పండుగకు గ్రామాల్లో ఎంతో ప్రత్యేక స్థానం ఉంటుంది. వర్షాలు సంవృద్ధిగా కురిసి, పాడి పంటలతో గ్రామాలు చల్లగా ఉండాలని పిండి వంటలతో పొల్లాల వద్ద దేవాతమూర్తులకు నైవేద్యాలు పెట్టి, రైతులు మొక్కులు మొక్కుతారు. మండల కేంద్రంలో ప్రత్యేకంగా పశువుల అలంకరణ సామగ్రి దుకాణాలు వెలిశాయి. దీంతో దుకాణాల వద్ద రైతులు అవసరమైన తాళ్లు, పంతాళ్లు, మువ్వలు, గంటలు తదితర వాటిని కొనుగోలు చేశారు.

గ్రామాల్లో ఏరువాక సందడి
పుల్కల్: గ్రామాల్లో ఏరువాక సందడి మొదలైంది. జేష్టమాసంలో వచ్చే పౌర్ణమిని ఏరువాక పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ పండగ రోజు రైతులు పశువులకు ప్రత్యేకంగా అలంకరించి పిండివంటలు తినిపిస్తారు. గ్రామాల్లో వ్యవసాయాంత్రీకరణ జరుగుతున్న వేళ కాడెద్దలు, పశువులు తగ్గుముఖం పట్టాయి. ఉన్న కొద్దిపాటి పశువులకు కాడెద్దులకు రైతులు సంబురంగా ఏరువాక పండుగగా జరుపుకుంటారు. ఏరువాక సందర్భంగా పశువులను అలంకరించడానికి పంతాళ్లు, నూలుతాళ్లు, రంగులు, మువ్వలు, కొత్తగా కొనుగోలు చేస్తారు. ఏరువాక నాడు ఉదయమే పశువులను కడిగి పరిశుభ్రంగా తయారు చేసి నూలుతాళ్లతో తయారు చేసిన పంతాళ్లు అలంకరిస్తారు. గోవులకు ఇష్టమైన పిండివంటల్లో ప్రత్యేకమైన అంబట్లు (అట్లు) పెడతారు. వేసవిలో పశుగ్రాసం కొరతతో అల్లాడుతున్న పశువులకు ఏరువాక నుంచి సమృద్ధిగా వర్షాలు కురవడంతో మేతల కొరత తీరుతుంది. కాగా గ్రామాల్లో అలంకరణ సామగ్రి దుకాణాలు రైతులతో సందడిగా మారాయి.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...