మిషన్ కాకతీయతో చెరువుకు మహర్దశ


Mon,June 17, 2019 12:31 AM

కోహీర్ : ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నది. ముఖ్యంగా రైతన్నల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ఇందులో భాగంగా మిషన్ కాకతీయను ప్ర తిష్ఠాత్మకంగా చేపట్టింది. దీంతో మండలంలోని ఆయా గ్రా మాల్లో ఉన్న చెరువులకు మహర్దశ కలిగింది. మండలంలో ని 40చెరువులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. మాచిరెడ్డిపల్లిలోని నర్సారెడ్డి చెరువు, చింతల్‌ఘట్ గుండం చెరువు, వెంకటాపూర్ బామని చెరువు, సజ్జాపూర్‌లోని సైదులు చెరువు, పైడిగుమ్మల్, నాగిరెడ్డిపల్లిలోని మైస మ్మ చెరువులను అభివృద్ధి చేశారు. అలాగే మండలంలోని దిగ్వాల్ గ్రామ సమీపంలో ఉన్నా గొల్లకుంటను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మిష న్ కాకతీయ ద్వారా చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టారు. చెరువులోని మట్టితో కట్ట ఎత్తును పెంచారు. అలుగు నిర్మాణాన్ని కూడా త్వరలో పూర్తి చేయనున్నారు. చెరువులోని సారవంతమైన మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకుంటున్నారు. రవాణా ఖర్చులు భరిస్తూ మట్టిని తమ పొలాలకు తీసుకువెళ్తున్నారు.

పెరుగనున్న భూగర్భజలాలు...
దిగ్వాల్ గ్రామ సమీపంలోని గొల్లకుంట చెరువును అభివృద్ధి చేయడంతో త్వరలో భూగర్భజలాలు పెరుగనున్నాయి. వ ర్షాకాలంలో కురిసిన నీరు చెరువులోకి భారీగా చేరుతుంది. దీంతో భూగర్భజలాలు పెంపొందుతాయి. గ్రామ పరిసర బోరుబావుల్లో కూడా నీటి నిల్వ పెరుగుతుంది. దీంతో రైతన్నలు తమ పొలాల్లో పంటలు సాగు చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా తయారు కానున్నాయి. పశువులు, పక్షులు కూడా తమ దాహార్థిని తీర్చుకునేందుకు చెరువులో నీరు పుష్కలంగా దొరుకుతుంది. 70సంవత్సరాల్లో చేయలేని పని తెలంగాణ ఏర్పడినాకా మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ వస్తుంది. యాబై సంవత్సరాలకు పైగా చెరువులో పూడిక పేరుకుపోయింది. చెరువు కట్ట పెంచడం, అలుగు నిర్మాణం, పూడికతీతను విజయవంతంగా చేపట్టారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువును అభివృద్ధిలోకి తీసుకువచ్చినందుకు గ్రామ రైతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కేవలం రవాణా ఖర్చులతో తమ పొలాలకు చెరువు మట్టిని తరలించడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...