టెండర్లు వేసిన పనులు వెంటనే ప్రారంభించాలి


Sun,June 16, 2019 12:08 AM

జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం పట్టణ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసినా అధికారులు నిర్లక్ష్యగా వ్యవహరిస్తున్నారని మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు రాములునేత, నామ రవికిరణ్‌లు ఆరోపించారు.
శనివారం జహీరాబాద్‌ మున్సిపల్‌ సమావేశం చైర్‌పర్సన్‌ షెబానా బేగం అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం జహీరాబాద్‌ పట్టణ అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ఇంజినీరింగ్‌ అధికారులు టెండర్లు వేసి కాంట్రాక్టర్లుకు పనులు అప్పగించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పనులు చేసేందుకు టెండర్లు వేసి కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్‌ చేసిన ఎందుకు ప్రారంభించడం లేదన్నారు.
మున్సిపల్‌లో నిధులు ఉన్న అధికారులు పనులు చేసేందుకు ముందుకు రాకడపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొందరు అధికారులు కౌన్సిలర్లు ప్రజా సమస్యలను అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదన్నారు. అధికారులు టెండరులు వేసిన పనులు వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ డీఈఈ శ్రీధర్‌రెడ్డి కల్పించుకొని రెండు నెలలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ బడ్జెట్‌ను అమోదించారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అజ్మత్‌ పాషా, కమిషనర్‌ విక్రమ్‌సింహారెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు, తదితరులు పా

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...